మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సెన్సార్ పూర్తయ్యింది. ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్‌తో సెన్సార్ ఫార్మాలిటీస్‌ని ‘సైరా నరసింహారెడ్డి’ పూర్తి చేసుకోవడం గమనార్హం. ఇక, ఈ సినిమా రన్ టైమ్ నిజంగానే షాకిచ్చింది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలకి రన్ టైమ్ కాస్తంత ఎక్కువగానే వుంటుంది. రొటీన్ సినిమాలతో పోల్చితే కొంచెం ఎక్కువే అయినా, ‘సైరా నరసింహారెడ్డి’ రన్ టైమ్‌పై గతంలో జరిగిన చర్చని పరిగణనలోకి తీసుకుంటే, చాలా షార్ప్‌గా ‘ఎడిటింగ్’ చేశారనే విషయం అర్థమవుతోంది.
ఇంతకీ ఫైనల్ రన్ టైమ్ ఎంతో తెలుసా.? 2 గంటల 44 నిమిషాలు. నిజంగానే ఇది షాకింగ్ రన్ టైమ్ అని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. కాగా, గత కొద్ది రోజులుగా ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్‌కి సంబంధించి దర్శకుడు, నిర్మాత హీరో కలిసి రన్ టైమ్ విషయమై అన్ని విధాలా సమాలోచనలు చేసి, రన్ టైమ్ విషయమై ఓ నిర్ణయానికి వచ్చారు. తొలుత 3 గంటలకు పైగా రన్ టైమ్ వుంటుందని ‘సైరా నరసింహారెడ్డి’ టీమ్ నుంచే కొందరు మీడియాకి విషయాన్ని లీక్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే, ఎలాంటి కట్స్ లేకుండా ‘సైరా నరసింహారెడ్డి’ ‘యు/ఎ’ సర్టిఫికెట్‌తో బయటకు రావడమంటే చిన్న విషయం కాదు. రామ్‌చరణ్ ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కిస్తున్న విషయం విదితమే.
నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత, సినిమాపై హైప్ నెక్స్‌ట్ లెవల్‌కి రీచ్ అయ్యింది. తెలుగుతోపాటు అన్ని సౌత్ లాంగ్వేజెన్‌లోనూ, హిందీలోనూ ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ‘సాహో’ తర్వాత, ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రిలీజ్‌గా ‘సైరా నరసింహారెడ్డి’ వార్తల్లోకెక్కుతోంది.
