మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహ రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల 15న ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని టీమ్ సన్నాహాలు చేస్తుంది.
ఇప్పటికే ఈ నెల 15న కర్నూల్ లో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేసారు. ప్లాన్ చేయడమే కాదు అక్కడ గ్రౌండ్ కోసం అన్వేషణ కూడా జరిగింది. కానీ ఇప్పుడు సైరా వేదిక తో పాటు డేట్ ని మార్చినట్టు తెలుస్తోంది. అవును సైరా ప్రీ రిలీజ్ వేడుక .. వేదిక రెండు మారినట్టు తాజా సమాచారం. ఈ ప్రీ రిలీజ్ వేడుకను హైద్రాబాద్ లోనే గ్రాండ్ గా చేయాలనీ టీమ్ ఫిక్స్ అయిందంట.
Also Read: బ్రేకింగ్ గాసిప్: చిరంజీవితో మహేష్‌బాబు సినిమా.!
కర్నూల్ లో అయితే ఫాన్స్ పట్టేంత గ్రౌండ్ లేదని, ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏమిటీ ? అన్న ఆలోచనతో ఈ వేదిక మార్చాలని టీమ్ భావించింది. పైగా పలువురు సెలబ్రిటీలు రావడానికి కష్టం అవుతుందని భావించిన టీమ్ ఈ వేడుకను హైద్రాబాద్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేసింది. అందుకోసం హైద్రాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో జరపాలని ఫిక్స్ అయ్యారు.
వేడుక కూడా ఈనెల 15 న కాకుండా 18కి మార్చినట్టు సమాచారం. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజని తో పాటు బిగ్ బి అమితాబ్ తో పాటు పలువురు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొంటారని టాక్.
