న్యాచురల్ స్టార్ నాని సూపర్ హిట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే శ్యామ్ సింగ రాయ్ థియేట్రికల్ వెర్షన్ లోని డిలీటెడ్ సీన్ ఒకటి డిజిటల్ రిలీజ్ లో ఉంది.
ఆ సీన్ లో నాని వేశ్యాగృహంలో ఉండి తన పోయెట్రీ చదువుతూ ఉంటాడు. అంతలో ఒక వేశ్య వచ్చి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అందుకు తనకు అభ్యంతరం లేదని, మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కచ్చితంగా తాను పెళ్లి చేసుకుంటానని శ్యామ్ సింగ రాయ్ అంటాడు.
శ్యామ్ సింగ రాయ్ ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేసే ఈ 40 సెకన్ల సీన్ ను ఎందుకు డిలీట్ చేసారో మరి చిత్ర టీమ్ కే తెలియాలి. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన విషయం తెల్సిందే.