చైనా వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనాతో భయపడుతోంది. 200 లకు పైగా దేశాలు కరోనా భారిన పడి విలవిలలాడుతున్నాయి. చైనా వైరస్ అని, చైనాలో పుట్టిన వైరస్ అని ఇప్పుడు అందరూ కూడా చైనాను నిందిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో పూర్తిగా బాధ్యత చైనాదే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కరోనా వైరస్ ఒక్కటే కాదు గతంలో మరో మూడు భయంకర వైరస్ లు కూడా చైనా నుండి వచ్చిందివే అంటూ ఇప్పుడు మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సార్స్ కూడా అప్పట్లో ప్రపంచాన్ని బయపెట్టింది. 2002 వ సంవత్సరంలో ఈ వైరస్ చైనా నుండే వచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. 37 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. మరణాల శాతం అప్పుడు 10 గా నమోదు అయింది. సార్స్ కు కూడా ఇప్పటి వరకు సరైన టీకాను తీసుకు రాలేక పోయారు.
1996 లో చైనా నుండే మొదలైనది ఏవియన్ ఫ్లూ. ఇది పక్షుల నుండి పక్షులకు వ్యాప్తి చెంది వాటితో మనుషులకు కూడా అప్పట్లో వచ్చింది. 2000 సంవత్సరం వరకు ఇది తన ప్రభావాన్ని చూపించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా మరింతగా భయాందోళనకు గురి చేసిన ఫ్లూ స్వైన్ ఫ్లూ వ్యాధి కూడా చైనాలోని మొదలు అయ్యిందని చాలా మంది అభిప్రాయం. 2007 లో ఇది ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో తెలిసిందే.
ఇక చివరగా కరోనా వైరస్ ఎక్కడ మొదలు అయ్యింది అంటే చిన్న పిల్లలు కూడా చైనా అని చెప్తారు. అలా మొత్తం నాలుగు భయంకర వైరస్ లకు పుట్టిన ఇళ్లుగా చైనా నిలిచింది. ఈ వైరస్ లను చైనా కావాలని పుట్టించిందా లేదంటే సహజ సిద్ధంగా పుట్టాయా అనేది తెలియాల్సి ఉంది
789970 133307Hi there, I discovered your weblog via Google although looking for 1st aid for a heart attack and your post looks quite interesting for me. 815227
237945 222067of course data entry services are extremely expensive that is why always make a backup of your files 413880
802469 35874You completed certain great points there. I did looking on the subject matter and found most persons will go together along with your blog 256938