Switch to English

స్వాతి ముత్యం.. ఇది ప్రేక్షకుల విజయం -నిర్మాత ఎస్. నాగవంశీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,162FansLike
57,297FollowersFollow

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ” మా సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. విమర్శకులు కూడా అన్ని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ మంచి వినోదాన్ని పంచామని ప్రశంసించడం ఆనందంగా ఉంది అన్నారు.

వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది నాగ వంశీ గారికి చిన్న విషయం అయ్యుండొచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దానిని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఎంత పెద్ద విజయమో అన్నారు.

గణేష్ మాట్లాడుతూ.. ” ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అని చిన్న తృప్తి కలిగింది అని సంతోషం వ్యక్తం చేశాడు.

నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “స్వాతి ముత్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది. చిత్ర విడుదలకు ముందు చిరంజీవి గారు పెద్ద మనసుతో మా సినిమాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు స్వాతి ముత్యం, గాడ్ ఫాదర్ రెండు చిత్రాలూ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. స్వాతి ముత్యం చిత్రానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది” అన్నారు.

దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. “ఈ సినిమాలో శైలజ అనే పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇలాంటి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

సురేఖా వాణి మాట్లాడుతూ.. “నన్ను చాలామంది ఎక్కువ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి పాత్రలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. అవకాశమొస్తే ఎందుకు చేయను. దర్శకుడు లక్ష్మణ్ మొదటిసారి నన్ను కలిసి ఈ సినిమాలో నా పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు.. నిజంగానే ఈ పాత్ర కోసం మొదట నన్నే అనుకున్నారా అని అడిగాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు మా వరకూ రావట్లేదు. వస్తే తప్పకుండా చేస్తాం. నేను సినిమాలు మానేశాను అని కొందరు అనుకుంటున్నారు. నేను సినిమా అమ్మాయిని, ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాను, నాకు ఇంతమంచి పాత్ర ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday special: రామ్ చరణ్.. ‘చిన్నప్పుడే చిచ్చర పిడుగు’

Ram Charan Birthday special: రామ్ చరణ్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. అమెరికాలో సైతం ఈ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయస్థాయిలో తెలుగు వాడి...

Keerthy Suresh: కీర్తి సురేష్ మంచి మనసు.. దసరా టీమ్ కు...

Keerthy Suresh: 'మహానటి' కీర్తి సురేష్ మంచి మనసు చాటుకుంది. నాచురల్ స్టార్ నాని- కీర్తి కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'దసరా'. ఇటీవలే షూటింగ్...

RRR: నాటు-నాటు అంటూ జర్మన్ ఎంబసీ స్ట్రీట్ డ్యాన్స్.. వీడియో వైరల్

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అచ్చ తెలుగు పాట నాటు నాటు సంచలనాలు తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు...

Jr Ntr: ఎన్టీఆర్ 30.. ఈ వార్త నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్ 30' పేరుతో ప్రచారంలో ఉంది....

Buggana: బుగ్గన కొత్త బుడగ.! బాధ్యతాయుత మద్యపానం.!

Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్....

రాజకీయం

Pawan Kalyan: ‘చట్టసభల్లో ఈ దాడులు భావ్యమేనా?’: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల దాడుల ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టిడిపి ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.ఈ మేరకు ఆయన సోషల్...

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1 పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చ జరగాలంటూ సోమవారం...

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.!...

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

ఎక్కువ చదివినవి

Balakrishna: వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ‘వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు రెండు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తుండడంపై...

Naatu Naatu Song: ‘నాటు నాటు’ కి మరో అరుదైన గౌరవం

Naatu Naatu Song: 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో సత్తా చాటిన 'నాటు నాటు' పాట, షార్ట్ ఫిలిం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' కు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఈ రెండు...

Oscar 2023: రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు అర్ధం చేసుకోండి..! సింగర్ కాలభైరవ క్షమాపణలు..

కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవ సినీ ప్రియులు, నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. ‘నాటునాటు పాట ఇంతటి విజయం అందుకోవడానికి కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇందులో నాకు ఎలాంటి సందేహంలేదు. ఆస్కార్ వేదికపై...

Janasenani Pawankalyan: అసెంబ్లీకి వెళతాం.! ఓట్లు మాత్రం కొనబోం

Janasenani Pawankalyan: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళతాం. నాతోపాటు పోటీలో నిలబడ్డ అభ్యర్థులంతా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి తీరతాం. ఓటుని మాత్రం కరెన్సీ నోట్లతో కొనబోం. మా కోసం కాదు.. మీ పిల్లల...

RRR: తగ్గని నాటు నాటు హవా..! పాటకు కాలు కదిపిన క్రికెట్ దిగ్గజం

ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన నాటు నాటు ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో ఇప్పుడీ పాట ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఇక్కడితో నాటు నాటు హంగామా పూర్తవలేదని ఇప్పటికీ...