జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దామా?
కథ :
15వ శతాబ్దంలో ‘సువర్ణ సుందరి’ అనే ఒక దుష్ట విగ్రహం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ దుష్ట శక్తి ప్రభావం వల్ల రాజ్యంలోని ప్రజలంతా చనిపోతారు. ఆ తర్వాత తరాలు మారినా, కాలాలు కదిలిపోయినా ఈ దుష్ట శక్తి మాత్రం చావదు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే.. ఈ దుష్ట శక్తి గురించి తెలియక ఈ సువర్ణ సుందరి విగ్రహాన్ని కొట్టేయడానికి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. మరోపక్క ఒక పురావస్తు శాస్త్రవేత్త జయప్రద (జయప్రద) ఎలాగైనా ఈ దుష్ట శక్తిని అంతం చేయాలని ప్రయత్నం చేస్తుంటుంది.
ఈ క్రమంలో అంజలి (పూర్ణ) దగ్గరకు ఈ విగ్రహం చేరుతుంది. ఈ క్రమంలో అంజలి (పూర్ణ) దుష్ట శక్తి ప్రభావంతో కొంతమందిని హత్య చేస్తుంది. ఇంతకు ఎవరు వాళ్ళు? చివరకు దుష్టశక్తి సువర్ణ సుందరి విగ్రహాన్ని ఎలా అంతం చేశారు ? అలాగే పూర్ణకి జయపద్రకి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ సినిమాలో నటించిన జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్ వంటి నటీనటుల నటన గురించి తప్ప, ఇక సినిమాలో పాజిటివ్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోయిన్ గా నటించిన పూర్ణ తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా పూర్ణ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. జయప్రద తన శాయశక్తులా నటించినా ఆమె పాత్ర చిత్రణ అయోమయంగా ఉంది. సాయికుమార్ పాత్ర ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. కోటా శ్రీనివాసరావు, నాగినీడు కేవలం గెస్ట్ రోల్స్ కి మాత్రమే పరిమితం. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
కానీ, సగటు ప్రేక్షకులకు కూడా ఈ సువర్ణ సుందరి సినిమా రుచించదు. సినిమా నిండా సిల్లీ డ్రామా మోతాదుకు మించిపోయింది. పైగా సినిమాలో చాలా సన్నివేశాలు అసలు ఏ మాత్రం నమ్మశక్యం కాని విధంగా వాస్తవ విరుద్ధంగా సాగుతాయి. జయప్రద పాత్ర మరీ కామెడీగా ఉంది. ఒక్క ఈ పాత్రే కాదు, అసలు ఏ పాత్ర కన్వీన్స్ కానీ విధంగానే సాగుతుంది. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో.. స్లో నేరేషన్ తో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను పూర్తిగా చంపేసింది.
ప్లస్ పాయింట్స్:
- స్టోరీ లైన్
- నటీనటులు
మైనస్ పాయింట్స్ :
- స్క్రీన్ ప్లే
- డైలాగ్స్
- దర్శకత్వం
- ఫేక్ ఎమోషన్స్ తో సాగే సిల్లీ డ్రామా
- స్లో నరేషన్
తీర్పు:
పీరియాడిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సువర్ణ సుందరి ఆ జోనర్ కు ఏ మాత్రం న్యాయం చేయకుండా నిరుత్సాహపరిచే కథనంతో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ వర్కౌట్ కానీ సీన్స్ తో విసిగిస్తుంది.