Switch to English

సినిమా రివ్యూ : సూర్యకాంతం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నటీనటులు : నిహారిక కొణిదల, రాహుల్ విజయ్, శివాజీ రాజా, సుహాసిని తదితరులు ..
దర్శకత్వం : ప్రణీత్
నిర్మాత : సందీప్ రెడ్డి, సృజన్ యఱబ్రోలు, రామ్ నరేష్
సంగీతం : మార్క్ కె రాబిన్
విడుదల : 29-03-2019
రేటింగ్ : 2.5 / 5

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ సారి సూర్యకాంతం గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. కొత్త దర్శకుడు ప్రణీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యకాంతం ఎం చేసింది, ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

సూర్యకాంతం ( నిహారిక ) చాలా గడుసు అమ్మాయి. ఆమెను తొలి చూపులోనే అభి ( రాహుల్ విజయ్ ) ఇష్టపడతాడు. ఈ నేపథ్యంలో సూర్యకాంతంతో పరిచయం చేసుకునే క్రమంలో ఆమె కూడా అభిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో సడన్ గా సూర్యకాంతం తల్లి ( సుహాసిని ) చనిపోవడంతో డిప్రెషన్ కు గురయిన సూర్యకాంతం అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆమెకోసం ఎదురు చూస్తున్న అభి ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తో పూజ ( పేర్లిన్ బేసానియా ) అనే అమ్మాయితో వివాహం ఫిక్స్ చేస్తారు. పూజతో ప్రేమలో పడ్డ అభి సూర్యకాంతంని మరచిపోయి సంతోషంగా ఉంటాడు. అలా అభి సంతోషంగా ఉన్న సమయంలో సూర్యకాంతం సడన్ ఎంట్రీ ఇస్తుంది ? సూర్యకాంతం ఎంట్రీ తో షాక్ అయిన అభి ఎం చేసాడు ? సూర్యకాంతంనే అభి పెళ్లి చేసుకున్నాడా ? లేక పూజ ను చేసుకున్నాడా ? ఇన్నాళ్లు సూర్యకాంతం ఎక్కడికి వెళ్ళింది లాంటి విషయాలు మిగతా కథ ..

నటీనటుల ప్రతిభ :

సినిమా మొత్తం సూర్యకాంతం పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సూర్యకాంతం పాత్రలో .. అల్లరి అమ్మాయి .. గడుసు పిల్లగా నిహారిక చక్కగా చేసింది. ఒకరకంగా ఇది టామ్ బాయ్ పాత్ర అని చెప్పాలి. ఇక హీరో రాహుల్ విజయ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. మరో హీరోయిన్ పూజ గా పేర్లిన్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈ కథను మలుపుతిప్పే పాత్ర కావడంతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక సినిమాలో గ్లామర్ విషయంలో ఉన్న లోటును పూజ పాత్రతో పూర్తీ చేయడంతో సినిమాలో ఏ లోపాలు లేకుండా సాగిందని చెప్పాలి. ఇక మిగతా పాత్రల్లో శివాజీరాజా, సుహాసిని, కమెడియన్ సత్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించి .. అక్కడక్కడా కామెడీ కూడా పండించే ప్రయత్నం చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

సాంకేతిక అంశాలను పరిశీలిస్తే .. మార్క్ రాబిన్ అందించిన సంగీతం యావరేజ్ గా నిలిచింది. పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. అయితే నేపధ్య సంగీతం మాత్రం జస్ట్ ఓకే అని చెప్పాలి. ఇక ఫోటోగ్రఫి ఫరవాలేదు. చాలా సీన్స్ అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి .. మొత్తానికి నూతన దర్శకుడు ప్రణీత్ ఎంచుకున్న ఈ ట్రయాంగిలర్ లవ్ స్టోరీ పాతదే అయినప్పటికీ దాన్ని కొత్తగా తెరకెక్కించే విషయంలో కాస్త తడబాటు పడ్డాడు. సన్నివేశాల మధ్య పొంతన కుదరకపోవడం లాంటి అంశాలు కన్ఫ్యూజ్ చేస్తాయి. కథ మొత్తం బోరింగ్ గా సాగుతుంది. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కథ మొత్తంగా బోరింగ్ గా సాగినా క్లయిమాక్స్ విషయంలో మాత్రం ఆకట్టుకున్నాడు దర్శకుడు.

విశ్లేషణ :

త్రికోణం ప్రేమకథతో కొత్త దర్శకుడు ప్రణీత్ తెరకెక్కించిన ఈ పాత కథ కొత్త తరహా ట్రీట్మెంట్ తో బిన్నంగా చేయాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. కథను చాలా నీరసంగా నడిపించిన దర్శకుడు ఏ విషయంలో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. సినిమా విషయంలో కథ పెద్ద మైనస్ గా మారింది. ఆసక్తి లేని కథ .. దానికి తోడు ఆకట్టుకొని సన్నివేశాలు, బోరింగ్ కథనంతో సినిమా నీరుగారిపోయేలా చేసింది. సూర్యకాంతం పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి ప్రేమ కథకు బలమైన సన్నివేశాలు కావాలి కానీ అలాంటివి ఏమి లేకుండా ఎలాంటి ఆసక్తి లేకుండా కథను నడిపించాడు దర్శకుడు.

ట్యాగ్ లైన్ : బోర్ కొట్టించింది

51 COMMENTS

  1. Ищете надежного подрядчика для устройства стяжки пола в Москве? Обращайтесь к нам на сайт styazhka-pola24.ru! Мы предлагаем услуги по залитию стяжки пола любой сложности и площади, а также гарантируем быстрое и качественное выполнение работ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...