ఇప్పుడు సౌత్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ ను డామినేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు అందరికంటే ముందు వరుసలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ హీరోలు కూడా ఇదే బాట పడుతున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా ఉన్న సూర్య ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ మూవీ అయిన కంగువాతో వస్తున్నాడు. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సుప్టుతో ఎవరూ రాలేదు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.
అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీస్తున్నారని అంటున్నారు. దాంతో ఈ ప్రచారం పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాశ్ ఐఫా వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. ఈ వార్తలు నిజమే అని.. త్వరలోనే దాన్ని అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు. ఈ మూవీ కోసం పనులు కూడా జరుగుతున్నాయన్నారు. దాంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సూర్య బాలీవుడ్ లో మూవీ చేయలేదు.
దాంతో ఇప్పుడు సూర్య అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహాభారతంలోని కర్ణ పాత్రను ఆధారంగా చేసుకుని పీరియాడిక్ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తారని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పురాణాలను బేస్ చేసుకుని వస్తున్న సినిమాలు భారీ విజయం సాధిస్తున్నాయి. అందుకే సూర్య మూవీపై అంచనాలు అప్పుడే పెరిగిపోతున్నాయి