కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. సూర్య 46వ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇక నేడు సినిమా షూటింగ్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా సూర్య పోస్టర్ తో పాటు వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు అనే కామెంట్ పెట్టారు.
దర్శకుడిగా వెంకీ అట్లూరి ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమాలు తీసి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ రెండు సినిమాలతో తన ప్రతిభ చాటిన వెంకీ అట్లూరి సూర్యతో చేస్తున్న సినిమాతో కూడా మంచి కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. సూర్య కూడా వెంకీ అట్లూరి మేకింగ్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది.
సూర్య 46 సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటిస్తుంది. యూత్ ఆడియన్స్ లో ఆమెకు సూపర్ క్రేజ్ ఉండగా ఈ సినిమాకు ఆమె కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జివి ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సితార బ్యానర్ నుంచి 33వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా వస్తుంది. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్.
