Switch to English

చిరంజీవి కుడిచేతికి ఆపరేషన్..! ఆందోళన వద్దన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన కుడిచేతికి బ్యాండేజ్ ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగాభిమానులతో ఆదివారం చిరంజీవి హైదరాబాద్ లోని సీసీటీలో భేటీ అయ్యారు. ఈక్రమంలో ఆయన చేతికి శస్త్ర చికిత్స అయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండటంతో అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

చేతికి ఏమైనా గాయమైందేమోనని అభిమానులు అడగ్గా.. ‘అరచేతికి చిన్నపాటి సర్జరీ జరిగింద’ని చెప్పారు. కుడి చేతితో ఏ పని చేస్తున్నా.. కొంచెం నొప్పిగా, తిమ్మిరిగా ఉండటంతో వైద్యులను సంప్రదించినట్టు చిరంజీవి వెల్లడించారు. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్‌ మీద ఒత్తిడి పడటం వల్లనే అలా అనిపిస్తోందని.. దానిని ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ అంటారని వైద్యులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని చెప్పారు.

45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి.. ఒత్తిడి తగ్గించారని చిరంజీవి పేర్కొన్నారు. పదిహేను రోజుల తర్వాత కుడి చేయి మళ్లీ యథావిధిగా పని చేస్తుందని తెలిపారు. అభిమానులు ఆందోళన చెందొద్దని అన్నారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చినట్లు వెల్లడించారు. కరోనా సెకండ్ సమయంలో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అభిమానులే ఈ ఆక్సిజన్ బ్యాంకులు నిర్వహణ, సిలిండర్లు అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులతో చిరంజీవి భేటీ అయ్యారు. ఈక్రమంలో తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. తన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో...

బిగ్ బాస్ 5: ఈసారి ఏ కంటెస్టెంట్ కు మూడింది?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

రష్మిక లక్ శర్వాకు తగులుకుంటుందా?

ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న శర్వానంద్ నెమ్మదిగా తన స్ట్రాంగ్ హోల్డ్ ను కోల్పోతున్నాడు. వరసగా ప్లాపులను అందుకుంటూ మార్కెట్ ను డౌన్ చేసుకుంటున్నాడు. 2017లో విడుదలైన మహానుభావుడు తర్వాత శర్వాకు హిట్ అన్నదే...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

బిగ్ బాస్ 5: ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో సన్నీ తప్పు చేశాడా?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటుండడంతో ఫైనల్స్ కు ఎవరు చేరతారు అన్న విషయంలో సస్పెన్స్ ఎక్కువవుతోంది. రోజురోజుకూ ఈ టెన్షన్ పెరిగిపోతోంది. ఆదివారం ఎపిసోడ్ లో యాంకర్ రవి...

జస్ట్ ఆస్కింగ్: వికేంద్రీకరణ అంటే ఏంటి.?

వికేంద్రీకరణ చుట్టూ ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి.? ఆ వికేంద్రీకరణకు అధికార పార్టీ చెబుతున్న చిత్రమైన అర్థమేంటి.. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ.. అని రెండున్నాయి...