Switch to English

వైసీపీ రంగులపై ‘సుప్రీం’ స్ట్రోక్‌.!

అయినా, ప్రభుత్వాలకి ఈ రంగుల పిచ్చేంటి.? ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీ రంగుల్ని జనం మీద బలవంతంగా రుద్దడమేంటి.? కాస్తంతైనా ఇంగితం లేనివారు ‘సేవ’ చేస్తాం అంటూ రాజకీయాల్లోకి వచ్చేసి, అధికార పీఠమెక్కేస్తోంటే, అలాంటివారికి అధికారమిచ్చినందుకు ప్రజలు అనుభవించాల్సిందేనేమో.! ‘మీ పార్టీ రంగుల్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు.?’ అని జనం నిలదీస్తే తప్ప, రాజకీయ పార్టీలు మారవు.

టీడీపీ హయాంలో పసుపు రంగు, అంతకు ముందు కాంగ్రెస్‌ హయాంలో మూడు రంగులు, ఇప్పుడు వైసీపీ హయాంలో మళ్ళీ మూడు రంగులు (గతంలో కాంగ్రెస్‌ రంగులు, ఇప్పుడు వైసీపీ రంగులు).. జనాన్ని పిచ్చెక్కించేస్తున్నాయంతే. ప్రభుత్వ కార్యాలయాలపై ఈ వైసీపీ రంగులు వివాదాస్పదమవుతున్నాయి. హైకోర్టు ఆల్రెడీ మొట్టికాయలేస్తే, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తాజాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ‘హైకోర్టు చాచి లెంపకాయ కొడితే.. అక్కడితో బుద్ధి తెచ్చుకోకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి రెండు చెంపలూ పగలగొట్టించుకున్నట్టుంది పరిస్థితి..’ అన్న చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోందిప్పుడు. అవును, సుప్రీంకోర్టు కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది.

‘కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలకి కాషాయ రంగు వేస్తే మీరు ఊరుకుంటారా.?’ అని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. నిజమే, రంగుల గురించిన చర్చ జరగాల్సిన సందర్భమిది. రాజకీయ పార్టీలకు చెందిన రంగులు, ప్రభుత్వ ఆస్తులపై అస్సలు కన్పించకూడదన్న చట్టం వచ్చి తీరాల్సిందేనేమో.! రేషన్‌ కార్డుల మీద అధికార పార్టీ రంగులు, ఇంకో ప్రభుత్వ పథకమ్మీద అధికార పార్టీ రంగులు. ఏం, ఎక్కడినుంచి తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు డబ్బుల్ని.? ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తాలే, ప్రభుత్వ ఖజనానాకి జమ అవుతున్నాయి.

అలాంటప్పుడు, తమ తాతలు తండ్రులు సంపాదించిన సంపాదన అన్నట్లు, ప్రజా ధనాన్ని తమ సొంత పార్టీల రంగుల కోసం వినియోగించడమేంటి.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది అధికారంలో వున్న పార్టీల ఆలోచన. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. రంగుల రాజకీయం పక్కన పెట్టి, ప్రజల గురించి ఆలోచించకపోతే.. ప్రజలు తిరగబడే రోజులొస్తాయ్‌.!

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్...

బిగ్ షాక్: స్వామి వారి ఆస్తులు వేలం వేస్తున్న టిటిడి.!

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం తాను అనౌన్స్ చేసిన పథకాలు అమలు చేయడం కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇది నడుస్తుండగా, మరో...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...