సర్వోన్నత న్యాయస్థానం తిరుపతి లడ్డూ ప్రసాదం ‘కల్తీ’ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా, ‘దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవు’ అంటూ ఓ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ప్రతి ఒక్కరూ చెప్పే మాటే.! నిజమే, దేవుళ్ళ విషయంలో రాజకీయాలు తగవు. కానీ, వాస్తవంలో అలా జరుగుతోందా.?
ఏదన్నా గ్రామ దేవత ఉత్సవం వస్తే చాలు, అక్కడా రాజకీయాలే.! అసలు, రాజకీయాల్లేని చోటు ఎక్కడైనా వుందా.? మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలపై రాజకీయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవాలయాల పాలక మండళ్ళు.. అంటే, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలే.!
టీటీడీనే తీసుకుంటే, ఆ బోర్డులో చేరేందుకు రాజకీయ నాయకులు చేసే ఫీట్లు.. ఓ రేంజ్‌లో వుంటాయ్. టీటీడీ ఛైర్మన్‌గిరీ.. అంటే, రాష్ట్ర మంత్రి పదవి కంటే ఎక్కువ.! ఆ మాటకొస్తే, కేంద్ర మంత్రి పదవి.. అన్నంతలా ఫీలయిపోతుంటారు కొందరు.! ఎందుకిలా.? దేవ దేవుని సేవ కోసమేనా ఈ తాపత్రయం.?
తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదన్న ఇంగితం ఎంతమంది రాజకీయాలకు వుంది.? తమ తమ అధినేతల్ని కీర్తించడానికి తిరుమలని వేదికగా చేసుకున్న రాజకీయ నాయకులు బోల్డంతమంది వున్నారు.
‘జగన్ రెడ్డి రక్షక గోవిందా..’ అంటూ ఏకంగా ‘గోవింద నామాన్నే’ తమక్కావాల్సిన విధంగా మార్చేసుకున్నారొకరు. ఆమె ఎవరో కాదు, గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమ