తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) అరెస్టుని సూపర్ స్టార్ రజనీకాంత్( Rajnikanth) ఖండించారు. ఈ మేరకు ఆయన ఈరోజు నారా లోకేష్ కి ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రబాబుకి త్వరలోనే క్లీన్ చిట్ వస్తుందని ఆయన గొప్ప పోరాట యోధుడని అన్నారు.
‘ నా ఫ్రెండ్ చంద్రబాబు ఎప్పుడు తప్పు చేయరు. ప్రజల కోసం ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన్ని కాపాడతాయి. తప్పుడు కేసులు, అరెస్టులు ఆయన ఇమేజ్ ని ఏమీ చేయలేవు. ప్రజల కోసం ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఆయన్ని కాపాడుతాయి. ఆయన గొప్ప పోరాట యోధుడు. ఈ కేసు నుంచి ఆయన త్వరలోనే బయటపడతారు’ అని లోకేష్ కి ధైర్యం చెప్పారు.
రజినీకాంత్- చంద్రబాబు మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది విజయవాడ వేదికగా జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వేదికగా చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంతో విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన అరెస్టును పలువురు సినీ నిర్మాతలు ఖండించారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుని రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారు.