విజేత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చేసిన రెండో చిత్రం సూపర్ మచ్చి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
బార్ సింగర్ రాజు (కళ్యాణ్ దేవ్) తన స్నేహితులతో సమయం గడుపుతూ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేసే కుర్రాడు. రాజు లైఫ్ స్టైల్ గురించి, అతని అలవాట్ల గురించి తెలిసి కూడా రాజును ఇష్టపడుతుంది మీనాక్షి (రచిత రామ్).
అసలు ఈ మీనాక్షి ఎవరు? ఆమె రాజును ప్రేమించడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? ఈ కథకు మీనాక్షి తండ్రి (రాజేంద్ర ప్రసాద్) కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.
నటీనటులు:
మొదటి సినిమాతో పోలిస్తే కళ్యాణ్ దేవ్ ఈ చిత్రంలో బాగా మెరుగయ్యాడు. తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అవుట్ డేట్ గా అనిపించినా కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ, పెర్ఫార్మన్స్ కానీ మెప్పిస్తాయి. మొత్తంగా కళ్యాణ్ దేవ్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు.
కన్నడ హీరో రచిత రామ్ చూడటానికి బాగుంది. ఆమె పాత్రను బాగా పోషించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా బాగుంది. అయితే కళ్యాణ్ దేవ్, రచిత రామ్ ల మధ్య కెమిస్ట్రీను సరిగా చూపించలేదు అనిపిస్తుంది.
రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రగతి తమ పాత్రలను డీసెంట్ గానే పోషించారు.
సాంకేతిక నిపుణులు:
పులి వాసు బేసిక్ పాయింట్ ఇంప్రెసివ్ గా ఉంది. అయితే నరేషన్ పరంగా ఎఫెక్టివ్ గా ప్రోజెక్ట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఎమోషనల్ గా డీల్ చేయడంలో సక్సెస్ అయిన దర్శకుడు మిగిలిన భాగాల్లో ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేరింగ్ గా ఉండుంటే చిత్ర ఔట్పుట్ మాత్రం వేరేలా ఉండేది.
ప్రస్తుతం సూపర్బ్ ఫామ్ లో కొనసాగుతోన్న ఎస్ ఎస్ థమన్, సూపర్ మచ్చి విషయంలో మాత్రం విపరీతంగా నిరుత్సాహపరుస్తాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే. బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండొచ్చు.
శ్యామ్ కె నాయడు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా అంతా ఫ్రేమ్స్ రిచ్ గా కనిపిస్తాయి. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు డీసెంట్ గా అనిపిస్తాయి.
విశ్లేషణ:
సూపర్ మచ్చి ప్లాట్ పరంగా ఆసక్తికరంగా అనిపించినా కూడా ఎగ్జిక్యూషన్ విషయంలో డల్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మొత్తంగా ఫ్లాట్ గా, అవుట్ డేటడ్ గా అనిపిస్తుంది. ఈ పండగ సందర్భంగా చూసుకున్నా కూడా సూపర్ మచ్చి నుండి ఏదైనా ఆశించడం నిరాశే అవుతుంది.
తెలుగుబులెటిన్ రేటింగ్: 1/5