విజయ్ సేతుపతి, సమంత, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన మాస్టర్ పీస్ మూవీ “సూపర్ డీలక్స్”. 2019 లో విడుదలైన ఈ మూవీ ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దైవసెల్వితీర్థం బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా త్యాగరాజ కుమార్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఇందులో ఆయన నటనకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. ఈ సినిమాని మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల చేయనున్నారు. నాలుగు విభిన్న స్టోరీస్ ని జోడించి తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సమంత, ఫహద్ ఫజిల్ పాత్ర లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.