Switch to English

A1 ఎక్స్ ప్రెస్ మూవీ రివ్యూ: సందీప్ కిషన్ వన్ మాన్ షో

Critic Rating
( 2.50 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow
Movie A1 ఎక్స్ ప్రెస్
Star Cast సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్
Director డెన్నిస్ జీవన్
Producer టిజి విశ్వా ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయ
Music హిప్ హాఫ్ తమిళ
Run Time 2 గంటల 18 నిముషాలు
Release మార్చ్ 5, 2021

యంగ్ హీరో సందీప్ కిషన్ సాలిడ్ హిట్ కొట్టడం కోసం, తను ఎంతో ఇష్టపడిన తమిళ హిట్ ఫిల్మ్ ‘నట్పే తుణై’ రీమేక్ రైట్స్ తీసుకొని, తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి తెలుగులో చేసిన ఫస్ట్ హాకీ బేస్డ్ ఫిల్మ్ ‘A1 ఎక్స్ ప్రెస్’. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి డెన్నిస్ జీవన్ డైరెక్టర్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఎక్స్ ప్రెస్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిందో చూద్దాం..

కథ:

సందీప్ నాయుడు(సందీప్ కిషన్) ఎలాగైనా ఫ్రాన్స్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలనుకునే కుర్రాడు. ఆ పని మీదే తన మామయ్య ఊరు యానాం వెళ్లిన సందీప్ అక్కడ హాకీ ప్లేయర్ లావణ్య రావు(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట్లో సందీప్ ని పెద్దగా పట్టించుకోని లావణ్య మెల్ల మెల్లగా తన ప్రేమలో పడుతుంది. అదే టైంలో స్పోర్ట్స్ మినిస్టర్, యానాంలోని హిస్టారికల్ చిట్టిబాబు హాకీ గ్రౌండ్ ని డబ్బు కోసం ఓ టెట్రా స్టార్ మెడికల్ కంపెనీకి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తానని డీల్ సెట్ చేసుకుంటాడు. అది తెలుసుకొని కోచ్ మురళి శర్మ ఆ గ్రౌండ్ మళ్ళీ దక్కించుకోవాలంటే యానాం టీమ్ ఫ్రాన్సిస్ టీంతో ఒక హాకీ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. దాని కోసం నేషనల్ ప్లేయర్స్ కావాలి అనుకున్నపుడు ఎక్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ సందీప్ ని అడుగుతారు. కానీ అతనికున్న ఫ్లాష్ బ్యాక్ వలన ఆడను అంటాడు. సందీప్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఎందుకు హాకీ వదిలేసాడు? చివరికి రావు రమేష్ ఎత్తులకు బలైపోతున్న చిట్టి బాబు గ్రౌండ్ కోసం మ్యాచ్ ఆడాడా? లేదా? ఆడితే గెలిపించి గ్రౌండ్ సొంతం చేసుకున్నారా లేదా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

A1 ఎక్స్ ప్రెస్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మరియు హాకీ మ్యాచ్ లలో కనిపించే సందీప్ కిషన్ సరికొత్త లుక్ లో ఆకట్టుకోవడమే కాకుండా, తన టోన్డ్ బాడీతో లేడీ ఫాన్స్ కి మరింత నచ్చేస్తాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఎనర్జిటిక్ లవర్ బాయ్ గా బాగా చేసాడు. ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ లో తన క్యూట్ లుక్స్ కి కుర్రకారు బాగానే కనెక్ట్ అవుతుంది. రావు రమేష్ వెటకారం, నెగటివ్ షేడ్స్ మిక్స్ అయిన పొలిటీషియన్ గా అక్కడక్కడా నవ్వించడమే కాకుండా మీడియా, పాలిటిక్స్, పీపుల్ మీద వేసిన సెటైరికల్ డైలాగ్స్ బాగున్నాయి. సత్య, మహేష్ విట్టలు అక్కడక్కడా నవ్విస్తారు. సినిమాకి కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో దర్శి, రాహుల్ రామకృష్ణలు తమ నటనతో సినిమాకి బలం చేకూర్చారు. మురళి శర్మ, పోసాని కృష్ణమురళి, అభిజీత్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు.

తెర వెనుక టాలెంట్..

A1 ఎక్స్ ప్రెస్ సినిమాకి మాతృక తమిళ సినిమా నట్పే తుణై.. ఆ సినిమా నుంచి పలు మార్పులు చేశారు, ఆ మార్పు చేర్పుల్లో భాగంగా కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారు. కానీ సినిమాకి కీలకమైన కొన్ని పాత్రలని ఎస్టాబ్లిష్ చేయడం మిస్ అయ్యారు. ఉదాహరణకి ఎమోషనల్ గా కనెక్ట్ చేయాల్సిన కోచ్ మురళి శర్మ పాత్రని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇక కథనం విషయంలో ఫస్ట్ హాఫ్ పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనే సరిపోతే సెకండాఫ్ లో కథ మొదలవుతుంది. అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగున్నా ఆ తర్వాత జరిగే సీన్స్ అంత ఆసక్తికరంగా అనిపించవు. సినిమాకి ప్రాణమైన క్లైమాక్స్ హాకీ మ్యాచ్ ని బాగుందా అంటే బానే ఉంది అనగలం కానీ మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా చేసిందా అంటే మాత్రం లేదనే చెప్పాలి. స్పోర్ట్స్ డ్రామా సినిమాలకి క్లైమాక్స్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కానీ అదే లైట్ అయిపోవడం, దానికి సుమ మరియు హర్షలతో చెప్పించిన కామెంటరీ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. కథనం పరంగా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయారని చెప్పచ్చు. డైరెక్టర్ గా డెన్నిస్ జీవన్ పెర్ఫార్మన్స్ లని రాబట్టుకోవడం లో సక్సెస్ అయ్యాడు, కానీ ఒక స్పోర్ట్స్ ఫిలింని ఆధ్యంతం ఉత్కంఠగా చెప్పడంలో సగ భాగమే సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాఫ్ తమిళ సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయితే, కవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ మైనస్. విజువల్స్ మనకి సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడంలో సహాయపడలేదని చెప్పాలి. కలరింగ్ మరియు ఫోకస్ ల విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదనేది తెరపై క్లియర్ గా తెలుస్తుంది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది, కానీ సెకండాఫ్ ని ఇంకాస్త రేసీగా కట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– సందీప్ కిషన్ వన్ మాన్ షో
– ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ ఎపిసోడ్
– ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్
– ఇంటర్వెల్ ఎపిసోడ్
– రావు రమేష్ పాత్ర

బోరింగ్ మోమెంట్స్:

– పాత్రలని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది
– ఆసక్తిగా లేని కథనం
– స్లో అనిపించే సెకండాఫ్
– సినిమాటోగ్రఫీ అండ్ డిఐ
– బెటర్ గా ఉండాల్సిన క్లైమాక్స్ మ్యాచ్

విశ్లేషణ:

యంగ్ హీరో సందీప్ కిషన్ తనకి బాగా కలిసి వచ్చిన ఎక్స్ ప్రెస్ టైటిల్ ని మళ్ళీ పెట్టుకొని, చాలా కాన్ఫిడెంట్ గా చేసిన స్పోర్ట్స్ డ్రామా ‘A1 ఎక్స్ ప్రెస్’ ఆధ్యంతం ఆకట్టుకోకపోయినా అక్కడక్కడా బాగానే అనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా సినిమా అంటే ఫస్ట్ హాఫ్ లో కథని డెవలప్ చేసినా, సెకండాఫ్ లో అటు ఎమోషన్స్ తో, ఇటు మ్యాచ్ లతో సీట్ లో నుంచి కదలనీకుండా చేసేలా ఉండాలి కానీ ఎమోషనల్ టచ్ ఇచ్చినా దాన్ని కంటిన్యూ చేయడంలో కాస్త తడబడ్డారు. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ‘A1 ఎక్స్ ప్రెస్’ కేసినేమాకి వెళ్తే పరవాలేదు అనే ఫీలింగ్ తో బయటకి వస్తారు.

చూడాలా? వద్దా?: సందీప్ కిషన్ ఫాన్స్ హ్యాపీగా చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.5/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...