Switch to English

మరో శిష్యుడికి అవకాశం ఇవ్వనున్న సుక్కూ

దర్శకులు తమ దగ్గర పనిచేసే శిష్యులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించడం అనేది సాధారణమే. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దగ్గర చేరిన బ్యాచ్ లో ప్రతిఒక్కరూ దర్శకునిగా తమదైన ముద్ర వేసుకున్నారు. కృష్ణ వంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్ ఇలా అందరూ వర్మ శిష్యులుగా అప్పట్లో గుర్తింపు పొందారు. ఆ తర్వాత నుండి ఏ దర్శకుడైనా ఒకరిద్దరిని ప్రోత్సహించడం మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకునిగా పేరు సంపాదించుకున్న సుకుమార్ తన శిష్యులను ప్రోత్సహించే విషయంలో అందరికంటే ముందున్నాడు.

వారికి దర్శకులుగా అవకాశాలిచ్చి, తాను సహ నిర్మాతగా ఉంటూ స్క్రిప్ట్ లను పర్యవేక్షిస్తూ తన శిష్యులకు అండగా నిలుస్తున్నాడు. కుమారి 21ఎఫ్ ద్వారా పల్నాటి సూర్య ప్రతాప్ ను దర్శకునిగా పరిచయం చేసిన సుకుమార్, 18 పేజిస్ సినిమాతో మరోసారి తనకు అవకాశమిస్తున్నాడు. ఇక ఉప్పెన చిత్రం ద్వారా తన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం మరో సుకుమార్ శిష్యుడు కూడా దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దగ్గర పనిచేస్తోన్న శ్రీకాంత్ అనే కుర్రాడు నాని హీరోగా ఒక స్క్రిప్ట్ ను అనుకున్నాడట. అది సుకుమార్ కు కూడా నచ్చి తన సహ నిర్మాణంలో సినిమాను తెరకెక్కిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ పూర్తయ్యాక శ్రీకాంత్ నానిని కలిసి కథ చేబుతాడట. నానికి స్క్రిప్ట్ నచ్చడం బట్టి ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళేది లేనిది తెలుస్తోంది.

ఏదేమైనా సుకుమార్ శిష్యుల విషయంలో చూపిస్తున్న కేర్ కు మెచ్చుకోకుండా ఉండలేం కదా.

సినిమా

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

తెలంగాణతో ‘నీటి పంచాయితీ’: ఏపీ వాదనలో ‘పస’ ఎంత.?

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. నిజానికి అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పుడు జల కళను సంతరించుకున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే....

తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై మళ్ళీ వార్తలు

నందమూరి తారక రామారావు ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు....

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

ఫ్లాష్ న్యూస్: 91 మందికి కరోనా అంటించిన బార్బర్

ప్రపంచంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అనుకుంటున్న సమయంలో...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...