బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. దేశ వ్యాప్తంగా ఈసినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టు పెద్ద హిట్ కావడంతో సెకండ్ పార్టుపై అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టే పోస్టర్లు, టీజర్ ఉండటంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇక మేకర్స్ కూడా అప్పుడప్పుడు కొన్ని లీకులు ఇస్తూ ఊరిస్తున్నారు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా రూ.1000 కోట్లు వసూలు చేయాలని బన్నీ, సుకుమార్ ప్లాన్ వేసుకున్నారు. ఇందులో భాగంగానే మూవీ ఫస్ట్ డే కోసం పెద్ద ప్లానే వేస్తున్నారంట.
ఓవర్సీస్ లో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9గంటల నుంచే షోలు వేయాలని చూస్తున్నారు. అలాగే నార్త్ ఇండియాలో 5వ తేదీ రాత్రి 9గంటల నుంచి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 6వ తేదీ ఉదయం 1గంట నుంచే షోలు వేయాలని చూస్తున్నారంట. అలా చేయడం వల్ల మొదటి రోజే భారీ కలెక్షన్లు వచ్చి హైప్ మరింత పెరుగుతుందని బన్నీ, సుకుమార్ భావిస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్లలో పెద్ద సినిమాలను బీట్ చేసి.. రికార్డుకొట్టాలని చూస్తున్నారు. అదే జరిగితే ఆటోమేటిక్ గా కావాల్సినంత బజ్ క్రియేట్ అవుతుందని.. అప్పుడు కలెక్షన్లు ఇంకా పెరుగుతాయని ప్లాన్ వేస్తున్నారంట.
ఎలాగూ నార్త్ ఇండియాలో కూడా పుష్ప-2 కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి.. హిందీ మార్కెట్ ను బేస్ చేసుకుని ముందే షోలు వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారంట. మొత్తంగా 6వ తేదీ కలెక్షన్లతో పోస్టర్లు వేయబోతున్నారన్నమాట. మరి వీరి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.