Switch to English

సుజనా చౌదరి అంత పెద్ద స్కెచ్చేశారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో సుజనా చౌదరి సహా మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు చేరిపోయి ఎన్నో రోజులు కాలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది.? అని తెలుగుదేశం పార్టీలో కొందరు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర మంత్రి పదవి పోగొట్టుకున్న వెంటనే సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీతో టచ్‌లోకి వెళ్ళిపోయారన్నది తాజాగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అప్పటినుంచీ సుజనా చౌదరి రైట్‌ టైమ్‌ కోసం ఎదురుచూస్తూ వచ్చారు.

సుజనా చౌదరి మాత్రమే కాదు ఈ లిస్ట్‌లో సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌ కూడా వున్నారట. లిస్ట్‌లో కొత్తగా చేరింది మాత్రం గరికపాటి మోహనరావు మాత్రమేనని తెలుస్తోంది. చంద్రబాబు తన బలవంతమ్మీద సుజనా చౌదరితో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించడంతోనే అసలు కథ మొదలయ్యింది. ‘అప్పుడు మేం మోడీ ప్రభుత్వం నుంచి బయటకు రావడం చారిత్రక తప్పిదం’ అని సుజనా చౌదరి తాజాగా సెలవిచ్చారు.

అయితే అలా మంత్రి వర్గంలోంచి సుజనా చౌదరి బయటకు వచ్చిన వెంటనే బీజేపీ పెద్దలు సుజనా చౌదరితో టచ్‌లోకి వచ్చారనీ, అలా సుజనా చౌదరి ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ‘కోవర్టు’ రాజకీయం నడిపారనీ, కొందరు ముఖ్య నేతల్ని సుజనా చౌదరి ద్వారా టీడీపీకి దూరమయ్యేలా చేశారనీ తాజాగా ఊహాగానాలు వినవస్తున్నాయి.

సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ విచారణలు వంటివన్నీ ఉత్తుత్తివేననీ, చంద్రబాబుకి అనుమానం రాకుండా మొత్తం కథ నడిచిందని తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు తనకు అత్యంత సన్నిహితుడి వద్ద వాపోయిన వైనం ఆ నోటా ఈ నోటా బయటకొచ్చింది. చంద్రబాబు సహజంగా ఎవర్నీ అంత గుడ్డిగా నమ్మేరనీ, కానీ చంద్రబాబు ఈసారి సుజనా చౌదరిని నమ్మి మోసపోయారని ఆ నేత అంటున్నారట.

చంద్రబాబు కలలో కూడా ఊహించని వెన్నుపోటుగా సుజనా చౌదరి పార్టీ మారడాన్ని అభివర్ణిస్తున్నారు. సుజనా చౌదరి బీజేపీలో చేరాక కూడా టీడీపీ మరింత ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పినా, ఇప్పుడాయన మాట మార్చేశారు. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా తనవంతు కృషి చేస్తానని అంటున్నారాయన. ఎంతైనా వ్యాపారవేత్త కదా.. ఎక్కడ వ్యాపారం బావుంటే, అటువైపు వెళ్ళిపోతారు. ఇప్పుడాయన చేసిందీ అదేనేమో!

7 COMMENTS

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

పార్టీకి పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళం: జనసేన కొత్త సభ్యత్వానికి శ్రీకారం

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 కోట్ల విరాళం అందించి...

కోనసీమకు భారీ నిధులు.. పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అక్కడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో...

‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారమే స్పెషల్ సాంగ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరు భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారంలోనే తొలి సాంగ్ విడుదల కానుంది. జై జ్ఞాన ప్రభ...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

Daily Horoscope: వృశ్చికంలో ఆర్థిక లాభాలు, మకరంలో ఉద్యోగావకాశాలు

ఫిబ్రవరి 15, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితం ఇస్తుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వింటారు. ఖర్చులు...