సుధీర్ బాబు హీరోగా వచ్చిన హంట్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. ఈ చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్ పట్ల చిత్ర టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
సుధీర్ బాబు ఈ చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ హంట్ మొదలుపెట్టేటప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నానని, ఆ విషయంలో చాలా భయపడ్డామని చెప్పాడు. ఫ్యాన్స్ కానీ రెగ్యులర్ ఆడియన్స్ కానీ చిత్రాన్ని చూసి మెచ్చుకుంటున్నారని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇంకా మాట్లాడుతూ, “ప్రేక్షకులు అందరూ ముప్పై నిముషాలు ఎక్స్ట్రా ఆర్డినరీ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది చిత్రాన్ని అప్ప్రీషియేట్ చేస్తున్నారు. అందరికీ థాంక్స్. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నా. నేను రెగ్యులర్ సినిమాలు అయితే చేయను. నా నుండి వచ్చిందంటే అది కచ్చితంగా డిఫెరెంట్ సినిమా అవుతుంది” అని అన్నాడు.
ఇక దర్శకుడు మహేష్ మాట్లాడుతూ, “ఆడియన్స్ నుండి వస్తోన్న రెస్పాన్స్ చాలా బాగుంది. వీకెండ్ తర్వాత కమర్షియల్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుస్తుంది. అందరూ డేరింగ్ అటెంప్ట్ అంటున్నారు. ఇది నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇలాంటి సినిమా తొలిసారి వచ్చింది. సుధీర్ బాబు గారికి హ్యాట్సాఫ్. భరత్ ఈ పాత్ర చేసినందుకు థాంక్స్. ఈ సక్సెస్ క్రెడిట్ సుధీర్ బాబు గారికే దక్కుతుంది. మా నిర్మాతలు ఎంతో అండగా నిలబడ్డారు. ఇటువంటి సినిమా చూసే అవకాశం అరుదుగా వస్తుంది. థియేటర్లకు వచ్చి సినిమా చూడండి” అని అన్నాడు.
ఇంకా భరత్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రైట్ సినిమాతో రావడానికి కొన్నేళ్ల టైమ్ పట్టింది. ఏదేమైనా సరైన సినిమాతో వచ్చానని అనుకుంటున్నా. ఈ సినిమాలో నేను భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పాడు.