ఏపీలో జిల్లాల పునర్విభజన కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతోంది. జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రం, ప్రాంతాల మార్పులు హీటెక్కిస్తున్నాయి. వైసీపీలోనే కొందరు నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కడప జిల్లా రాజంపేటలో మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడిదే అంశంపై రాజంపేటలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. కొత్తగా ఏర్పాటయ్యే అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై వారు మండిపడుతున్నారు. ఈమేరకు రాజంపేట వేసీపీ నేత, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు.. 3వేల మంది విద్యార్ధులు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంగా ‘రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు’ అరు నినాదంతో స్థానిక బస్ స్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.
శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజనతో రాజంపేటకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. రాజంపేటలో వనరులు ఎక్కువగా ఉన్నా.. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం తగదని అన్నారు.