Amaran: ‘అమరన్’ చిత్ర బృందానికి చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి విఘ్నేశన్ 1.10 కోటి పరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఇప్సుడు వారిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. డిసెంబర్ 5నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ‘అమరన్’ స్ట్రీమింగ్ కాకుండా బ్యాన్ విధించాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు.
‘సినిమాలో నా ఫోన్ నెంబర్ ఉపయోగించారు. నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో నాకు మానసిక ప్రశాంతత లేకపోయింది. నా కుటుంబంతో కూడా సరిగా గడపలేక పోయాను. చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించినా నా నెంబర్ తొలగించలేదు. ఇప్పటికీ నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాన’ని పేర్కొన్నాడు.
తమిళంలో తెరకెక్కిన ‘అమరన్’ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కింది. శివకార్తికేయన్ హీరో. ఓ సన్నివేశంలో సాయిపల్లవి హీరోకు తప ఫోన్ నెంబర్ ఇస్తుంది. టీమ్ ఉపయోగించిన ఆ నెంబర్ విఘ్నేశన్ అనే విద్యార్ధిది. దీంతో ఆయనకు విపరీతమైన ఫోన్ కాల్స్ రావడంతో హైకోర్టును ఆశ్రయించాడు.