లాక్ డౌన్ తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరించే విషయంలో మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సర్వీసులు పునరుద్దరించేముందు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదించి ఉండాల్సింది అని పలు రాష్ట్రాల అధికారులు అంటున్నారు. మే 25న విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు మే 21 ప్రకటన చేయడంపై తాము విస్మయానికి గురయ్యామని ఆయా రాష్ట్ర అధికారులు అంటున్నారు.
మార్చిలో మొదటి దశ లాక్ డౌన్ ను ప్రకటించిన సమయంలోనూ మోదీ కేవలం నాలుగు గంటల్లో ప్రకటన చేశారని గుర్తు చేస్తున్నారు. విమాన సర్వీసులు పునరుద్దరణపై ఏపీ, బెంగాల్, మహారాష్ట్ర వంటి చాలా రాష్ట్రాలు తమ అభ్యంతరాలు చెప్పాయని అధికారులు అంటున్నారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల వల్లే సోమవారం దేశంలోని అనేక విమానాశ్రయాల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొందని అంటున్నారు. నిజానికి నాలుగో దశ లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఈనెల 31వరకూ విమాన సర్వీసులు నడపకూడదని ఉత్తరాదికి చెందిన అధికారి అంటున్నారు. ఆయా విమానాశ్రయాల్లో కేంద్రం విధించిన గైడ్ లైన్స్ కు ప్రభుత్వ ఏజెన్సీలు పాటించే గైడ్ లైన్స్ కు సంబంధం లేదని పలు రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి.
ముర్షిబాద్ కు చెందిన ఓ కుటుంబం స్వస్థలాలకు చేరుకునేందుకు ట్రైన్ టికెట్స్ కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. విమాన సర్వీసులు పున:ప్రారంభమవుతున్నాయని తెలిసి ముంబయ్ నుంచి కలకత్తా వేళ్లేందుకు రూ.30,600 తో ఇండిగో ఫ్లయిట్ టికెట్స్ కొనుగోలు చేశారు. అయితే ప్రయాణ తేదీన ఫ్లయిట్ క్యాన్సిల్ అయింది. ఈ విషయం వారికి విమాన సంస్థలు తెలపలేదు. క్యాన్సిల్ అయినందుకు టికెట్స్ నగదు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. లాక్ డౌన్ లో అసలే పనులు లేక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పుడు విమాన టికెట్ల డబ్బులు కూడా వెనక్కి రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3 labourers, no income since lockdown, tried repeatedly for train tickets, then heard flights to restart @HardeepSPuri. Family back home in Murshidabad sold cattle, on May 22 paid Rs 30,600 to @IndiGo6E for 3 Mum-Kol May 25 tickets. But flight cancelled, no refund. Stranded. pic.twitter.com/op2vzSYHQR
— Manju V (@ManjuVTOI) May 26, 2020
777547 238934I just couldnt depart your website prior to suggesting that I incredibly enjoyed the standard info an individual give for your visitors? Is gonna be back often in order to inspect new posts 734432