Squid Game: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ ల్లో ఒకటి ‘స్క్విడ్ గేమ్’. ప్రస్తుతం ‘స్క్విడ్ గేమ్-2’ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. 92 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 68మిలియన్ వ్యూస్ సాధించింది. ఇంతటి ప్రజాదరణ పొందిన గేమ్ ను మన దక్షిణాది హీరోలు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంటరైతే ఎలా ఉంటుంది..? ఇదే ఐడియా వచ్చిందో నెటిజన్ కి.
ఇండియన్ సినిమా సూపర్ స్టార్స్.. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్, అజిత్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ధనుష్, విజయ్ సేతుపతి, హృతిక్ రోషన్, త్రిష, రానా, బ్రహ్మానందం.. అందరినీ గేమింగ్ డ్రెస్ ధరించిన ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించాడు.
‘మన హీరోలు స్క్విడ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఊహించండం’టూ వీడియో షేర్ చేయడంతో నెటిజన్లను విషేషంగా ఆకర్షిస్తోంది. ఫ్యాన్స్ కూడా మురిసిపోతూ షేర్ చేస్తున్నారు.
This is so good !! AI Generated !!#SquidGameSeason2 pic.twitter.com/uv3E1Rao4I
— CacheInd (@cacheind) January 6, 2025