Switch to English

మూవీ రివ్యూ: స్టాండప్ రాహుల్

Critic Rating
( 2.00 )
User Rating
( 1.50 )

No votes so far! Be the first to rate this post.

Movie స్టాండప్ రాహుల్
Star Cast రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ
Director శాంటో
Producer నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
Music స్వీకర్ అగస్తి
Run Time 2 hr 10 Mins
Release 18 మార్చ్, 2022

వరస ప్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ హిట్ కొట్టడానికి ఈసారి స్టాండప్ కామెడీ సెటప్ ను బేస్ గా తీసుకున్నాడు. ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.

కథ:

స్టాండప్ కమెడియన్ గా ఎదిగాలని కలలు కంటుంటాడు రాహుల్ (రాజ్ తరుణ్). లైఫ్ ను ఈజీగా తీసుకునే రాహుల్ జీవితంలోకి శ్రియ రావు (వర్ష బొల్లమ్మ) వచ్చాక కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. రాహుల్ కు తన పేరెంట్స్ జీవితం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

రాజ్ తరుణ్ ట్రెండీగా కనిపించాడు. తన హెయిర్ స్టైల్, మ్యానరిజమ్స్, స్టైలింగ్ అన్నీ సరిగ్గా సెట్ అయ్యాయి. పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. పాత్రకు సరిపోయాడు. వర్ష బొల్లమ్మకు మరో మంచి పాత్ర పడింది. రాజ్ తరుణ్ తో ఆమె కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. శ్రియ రావు పాత్రకు పెర్ఫెక్ట్ ఫిట్ అనిపించుకుంది.

ఇంద్రజ, మురళీ శర్మ విడిపోయిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులుగా నటించారు. వాళ్ళ పెర్ఫార్మన్స్ కూడా సినిమాకు ఉపయోగపడింది. మిగతా వాళ్లంతా మాములే.

సాంకేతిక వర్గం:

శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. సినిమా అంతా చాలా అందంగా కనిపించడానికి సినిమాటోగ్రఫీ ముఖ్య భూమిక పోషించింది. లైటింగ్, ఫ్రేమ్స్ కూడా మెప్పిస్తాయి. రవితేజ గిరజాల ఎడిటింగ్ కూడా ఫైన్.

స్వీకర్ అగస్తి పాటల పరంగా డీసెంట్ జాబ్ చేసాడని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలను ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.

శాంటో ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు. యూత్ కు నచ్చే ఒక కాన్సెప్ట్ ను తీసుకుని దాన్ని తన ప్యాషన్ కు, తన తల్లిదండ్రుల రిలేషన్ కు ముడిపెట్టిన విధానం బాగుంది. అయితే ఎగ్జిక్యూషన్ విషయంలోనే శాంటో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే ను మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది.

పాజిటివ్ పాయింట్స్:

  • కథ సెటప్
  • పెర్ఫార్మన్స్

నెగటివ్ పాయింట్స్:

  • నరేషన్
  • స్క్రీన్ ప్లే

చివరిగా:

స్టాండప్ రాహుల్ యూత్ ను టార్గెట్ చేసిన ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. అక్కడక్కడా మెప్పించే స్టాండప్ రాహుల్ లో నరేషన్ ఒక ఫ్లో లో లేకపోవడం కంప్లైంట్. అందువల్లే ఈ చిత్రం బిలో యావరేజ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: బాక్సాఫీస్ బాక్సులు బద్దలకొట్టిన చిరంజీవి ‘రౌడీ అల్లుడు’

మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్ అయిన చిరంజీవి.. అందుకు పడ్డ శ్రమ, కష్టం, నటనపై ఉన్న మక్కువ, సినిమాపై ఆసక్తి ప్రధాన కారణం. తెరపై చిరంజీవి మాస్ పవర్ చూసేందుకు...

మోడీ, బాబు కలయిక.! వాళ్ళకి హ్యాపీ, వీళ్ళకి బీపీ.!

ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఎదురు పడితే కులాసాగా కబుర్లు చెప్పుకోవడం కొత్తేమీ కాదు. రాజకీయంగా ఇద్దరి మధ్యా ఎన్ని విభేదాలు వున్నాగానీ.. తప్పవు.. కాస్సేపు నటించాల్సిందే.! అయినా, నటించాల్సిన అవసరమేముంటుంది.? వ్యక్తిగత వైరాలు...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: దూకుడు నుంచి టాలీవుడ్ కు ఓవర్సీస్ మార్కెట్ పెంచిన మహేశ్

మహేశ్ బాబు కెరీర్ గ్రాఫ్ అంటే పోకిరికి ముందు ఆ తర్వాతగా మారిపోయింది. ఆయన కెరీర్లో పోకిరి సృష్టించిన మేనియా ఆస్థాయిలోనిది. ఈ సినిమా తర్వాత వచ్చిన సైనికుడులో తొలిసారి సూపర్ స్టార్...

కేవలం ఆమిర్ కోసమే లాల్ సింగ్ చడ్డాను ప్రమోట్ చేస్తున్నా – చిరు

ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హిందీతో పాటు తెలుగులో కూడా...

రాశి ఫలాలు: శనివారం 13 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ బహుళ విదియ రా.తె.3:34 వరకు తదియ సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: శతభిషం రా.3:53 వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం: శోభ...