SSMB29: మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ నటులు సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. #SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించలేదు.
ఒడిశాలో ప్రారంభమైన షూటింగ్ పలు ప్రాంతాల్లో జరుపుకోనుంది. అయితే… షూటింగ్ విశేషాలను కొందరు మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అవి వైరల్ కావడంతో అవుతున్నాయి. దీంతో విజువల్స్ లీక్ చేసిన వారిపై చిత్రబృందం చర్యలకు దిగింది. మరోవైపు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు తొలగించేందుకు ఉపక్రమించింది.
మహేశ్ ఫ్యాన్స్ కూడా వీడియోలు వైరల్ చేయొద్దని సోషల్ మీడియాలో కోరుతున్నారు. సినిమా మొదలైనట్టు ఇంకా టీమ్ అధికారికంగా ప్రకటించకపోయినా ఇటివలే మహేశ్-పృథ్వీరాజ్ సుకుమారన్ ఫొటోలు వైరల్ అయ్యాయి. సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది.