దర్శకధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. అయితే మూవీ పూజా కార్యక్రమంకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా రివీల్ చేయకపోవడం నిజంగా అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఇప్పటి వరకు ఏ సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా ఇలా సీక్రెట్ గా చేయలేదు. కానీ రాజమౌళి ఏం చేసినా అది చర్చనీయాంశమే కదా. అందుకే ఈ మూవీ షూటింగ్ గురించి కూడా ఏ ఒక్క క్లూ బయటకు వదలకూడదనేది రాజమౌళి ఉద్దేశం అని తెలుస్తోంది. మహేశ్ బాబు ఈ సినిమా కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుతున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం పై సన్నివేశాలు తీస్తున్నారు. ఈ ముగ్గురిపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత షెడ్యూల్ ఆఫ్రికా అడవుల్లో ఉంటుందని మూవీ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇందులో కొందరు హాలీవుడ్ తారలు కూడా మెరుస్తారని అంటున్నారు. యాక్షన్, అడ్వెంచర్ జానర్ లో సినిమా తీస్తున్నట్టు ఇప్పటికే చాలా హింట్స్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత రాజమౌళి సినిమాను స్టార్ట్ చేశారు. మహేశ్ బాబుతో తొలిసారి జక్కన్న మూవీ చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.