SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై చిత్ర బృందం సైలెంట్ అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ చిత్రం విడుదల కానున్నట్టు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
హైదరాబాద్లోని సారథి స్టూడియోస్ లో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. మహేష్ గతేడాది ‘సర్కార్ వారి పాట’ చిత్రంతో పలకరించారు. కీర్తి సురేష్ కథానాయిక గా నటించిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది.
