Switch to English

గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయం నా ‘హిట్’ సెంటిమెంట్ ని కొనసాగించింది: ఎస్.ఎస్. తమన్ ఇంటర్వ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు తమన్ గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్ ని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారు.

దసరాకి గాడ్ ఫాదర్ తో విజయం అందుకున్నారు .. అదీ మెగాస్టార్ సినిమాతో ఎలా అనిపిస్తుంది ?

చాలా ఆనందంగా వుంది. నాకు ఫస్ట్ హీరో హిట్ సెంటిమెంట్ వుంది. నేను తొలిసారి కలసి పని చేసిన హీరోలందరి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. మహేష్ బాబు గారితో దూకుడు, రవితేజ గారితో కిక్, ఎన్టీఆర్ గారితో బృందావనం, పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్, బాలకృష్ణ గారితో అఖండ.. ఇలా అన్నీ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో నేను చేసిన తొలి సినిమా గాడ్ ఫాదర్ కూడా బ్లాక్ బస్టర్ కావడం సెంటిమెంట్ కొనసాగినట్లయింది. చిరంజీవి గారికి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనలో చాలా లేయర్స్ వుంటాయి. అవన్నీ అందుకోవడం అంత ఈజీ కాదు. నేను, దర్శకుడు మోహన్ రాజా ఏడాది పాటు చాలా కష్టపడ్డాం. మ్యూజిక్ కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్ గా హై తీసుకురావడం ఒక పెద్ద సవాల్. సినిమా చూసిన ప్రేక్షకులు సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా వుంది. గాడ్ ఫాదర్ లో ఒక యూనివర్సల్ బాస్ ఫీలింగ్ సౌండ్ రావాలి. లండన్ లో ప్రతిష్టాత్మక అబేయ్ రోడ్ స్టూడియోస్ లో గాడ్ ఫాదర్ స్కోర్ చేశాం. ఆ స్టూడియో అందరికీ ఇవ్వరు. అక్కడ రికార్డ్ చేసిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్.

లూసిఫర్ చూసినప్పుడే ఇందులో పాటలకు స్కోప్ లేదని అర్ధమైయింది కదా .. కానీ ఆ ప్లేస్ మెంట్స్ ని ఎలా పట్టుకున్నారు ?

ఇందులో నాకు దర్శకుడు మోహన్ రాజాకి అదే పెద్ద సవాల్. ఇందులో హై పాటలకు అవకాశం లేదు. కథని నడిపే పాటలు కావాలి. నేను,. రాజా అదే విషయం చాలా మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్నట్లుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి నాకు సినిమా చూపించారు. తర్వాత నేను, రాజా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ కూర్చుని పాటల ప్లేస్ మెంట్స్, సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. అప్పటికే ఆర్కెస్ట్రా వరకూ నేను వర్క్ పూర్తి చేశాను. ఇందులో చేసిన ఆర్ఆర్ కింగ్ డమ్ గా వుంటుంది. మా టీం అందరికీ చిరంజీవి గారంటే ఇష్టం. అందరూ ప్రాణం పెట్టి చేశారు. చిరంజీవి గారు ఒక మహా వృక్షం. ఆ వృక్షానికి నీరు పోయడం అంత తేలిక కాదు. ఎంతపోసిన ఇంకా అడుగుతూనే వుంటుంది. ఆయనకి సినిమా చేస్తున్నపుడు ఆయన గత సినిమాలతో కూడా పోలిక వస్తుంది. మణిశర్మ గారు, కోటి గారు , కీరవాణి గారు .. ఇలా అందరూ చిరంజీవి గారి అద్భుతమైన మ్యూజిక్ చేశారు. మనం నెక్స్ట్ లెవల్ లో ఎలా చేయాలని అలోచిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకొని పని చేశాం. నేను చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా పని చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ అనేది సెకండరీ.

అల వైకుంఠపురంలో సిత్తరాల సిరపడు పాట ఫైట్ లో మిక్స్ చేశారు..ఇందులో నజభజజజరా పాటకు అదే స్ఫూర్తి ఇచ్చిందా ?

టెంప్లెట్ ఒకటే. కానీ ఇందులో కూల్ గా వుంటుంది. గాడ్ ఫాదర్ లో చాలా ఫెరోషియస్ గా వుంటుంది. చాలా పవర్ ఫుల్ ఫైట్ అది. ఆ ఫైట్ కి పాట చేద్దామనే నా అలోచన దర్శకుడు మోహన్ రాజాకి నచ్చింది. వంద చెట్లు చిరంజీవి గారితో కలసి పాడితే ఎలా వుంటుంది ? ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ? అనే ఆలోచన చేసిన ట్యూన్ అది. అనంత శ్రీరాం చాలా లోతుగా ఆ పాటని రాశారు. థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆర్ఆర్ కి ఎంత సమయం తీసుకున్నారు ?

నేపధ్య సంగీతం, డాల్బీ మిక్సింగ్ అంతా కలుపుకొని ఈ సినిమాని పూర్తి చేయడానికి 40 రోజులు పట్టింది. ఇది తక్కువ సమయంలో పూర్తి చేసినట్లే లెక్క. ఈ సినిమా కోసం నేను దర్శకుడు మోహన్ రాజా చాలా హోం వర్క్ చేశాం కాబట్టి త్వరగా పూర్తి చేయగలిగాం. చిరంజీవి గారు నయనతార మధ్య వచ్చే బ్రదర్ సెంటిమెంట్ పాట లూసిఫర్ లో లేదు. గాడ్ ఫాదర్ లో అది మంచి ప్లేస్ మెంట్ లో కుదిరింది. లూసిఫర్ లో మ్యూజిక్ ఏమీ గుర్తుండదు. కానీ గాడ్ ఫాదర్ లో గుర్తుపెట్టుకునే మ్యూజిక్ చేయడం గొప్ప అనందాన్ని ఇచ్చింది. ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారు అంత గొప్ప గా ఫెర్ ఫార్మ్ చేయడం వలనే ఇంత మంచి పేరొచ్చింది. దర్శకుడు మోహన్ రాజా నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ్ చరణ్, ఎన్ వి ప్రసాద్, ఆర్ బి చౌదరి గారు చాలా ప్రోత్సహించారు. సల్మాన్ ఖాన్ గారు రెమ్యునిరేషన్ కూడా తీసుకోకుండా కేవలం చిరంజీవి గారిపై వున్న ప్రేమతో చేశారు. మేమంతా మా బాస్ చిరంజీవి గారి కోసం పని చేశాం.

చిన్నపుడు మీకు బాగా నచ్చిన చిరంజీవి గారి పాట ఏమైనా వుందా ?

చిన్నప్పుడు మా అమ్మ గారితో కలసి కోటి గారి రికార్డింగ్ కి వెళ్లాను. అందంహిందోళం పాట జరుగుతుంది. అప్పుడు నాకు ఐదేళ్ళు వుంటాయి. అప్పుడే చిరంజీవి గారికి ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుండి ఒక్క సినిమా కూడా వదిలేవాడిని కాదు. ఇంట్లో ఎప్పుడూ చిరంజీవి గారి పాటలే వాయిస్తూ వుండేవాడిని.

గాడ్ ఫాదర్ కి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ?

చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లీమెంట్స్ మర్చిపోలేను. దర్శకుడు శంకర్ గారు ఫోన్ చేసి అభినందించారు. మణిశర్మ, కోటి గారు కూడా ఫోన్ చేశారు. అలాగే చాలా మంది మెగా అభిమానులు ఫోన్ చేసి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మా మ్యూజిక్ టీమ్ చిరంజీవి గారితో కలసి ఈ సినిమాని చూశాం. చిరంజీవి గారు నన్ను ఎంతో ప్రేమగా కౌగలించుకున్నారు. చాలా గ్రేట్ ఫీలింగ్. మరో కమర్షియల్ సినిమా చేద్దామని ఆయన్ని అడిగాను. తప్పకుండా చేద్దామని మాటిచ్చారు( నవ్వుతూ). మెగాస్టార్ గారు గ్రేట్ లెజండ్. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ ని. చాలా అనందంగా వుంది. గాడ్ ఫాదర్ విజయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో...

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

Karthikeya: కార్తికేయ “భజే వాయు వేగం”.. ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya). ఆయన నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...

Akira Nandan: హీరోగా అనౌన్స్ చేయని టాలీవుడ్ సెన్సేషన్.. ‘అకీరా నందన్’

Akira Nandan: రెండున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై స్టయిల్ కు కేరాఫ్ అడ్రస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ పేరు వింటే యూత్ కి, ఫ్యాన్స్ కి వైబ్రేషన్స్ వస్తాయి. కెరీర్...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Kona Venkat: ‘పాలిటిక్స్ వద్దంటే పవన్ వినలేదు..’ కోన వెంకట్ కామెంట్స్ వైరల్

Kona Venkat: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు తనకు మధ్య రాజకీయాలపై జరిగిన సంభాషణలు చెప్పుకొచ్చారు రచయిత కోన వెంకట్ (Kona Venkat). గతంలో అంజలి నటించిన గీతాంజలి...

విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఎందుకు.?

విజయ్ దేవరకొండ చాలా మారాడు.! ఔను, చాలా చాలా మారాడు.! ‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ ఎక్కడ.? ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ఎక్కడ.! ఈ మార్పు నిజంగానే అనూహ్యం. మూతి...