బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలగలనుకున్న శృతి హాసన్ కు ఏకంగా హాలీవుడ్ ఛాన్స్ రావడం నిజంగా లక్కీ అని చెప్పాలి. సౌత్ గ్లామర్ భామ శృతి హాసన్ కు హాలీవుడ్ నుండి పిలుపు రావడంతో అందరు షాక్ అవుతున్నారు. ఈ మధ్య అవకాశాలు వస్తున్నా కూడా సినిమాలను మానేసి కొన్నాళ్ళు ఖాళీగా ఉన్న శృతి మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది.
ఇప్పటికే రవితేజ సరసన ఓ సినిమాకు కమిట్ అయ్యింది. దాంతో పాటు మెగాస్టార్ – కొరటాల సినిమాలో కూడా కీ రోల్ లో నటిస్తుందట. తాజాగా శృతి హాసన్ కు హాలీవుడ్ లో ఓ టివి సిరీస్ కోసం శృతి హాసన్ కు పిలుపు వచ్చింది. ట్రెండ్ స్టోన్ అనే టైటిల్ తో ఈ సిరీస్ తెరక్కనుందట.
ఈ సిరీస్ ను యూఎస్ నెట్వర్క్ అనే ప్రముఖ సంస్థ నిర్మిస్తుందని, ఈ సిరీస్ ఇప్పటికే హాలీవుడ్ లో బాగా పాపులర్ అయిందట .. దానికి కొనసాగింపుగా తెరకెక్కించే ఈ షోలో శృతి రోల్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఇందులో సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయి పాత్రలో లేడి కిల్లర్ రోల్ కోసం శృతి ని అడిగారట. సో ఈ అఫర్ కు కూడా శృతి హాసన్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని టాక్ .
మొత్తానికి శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్ జోరుగా సాగె అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ మంచి జోరుమీదున్నప్పుడు సినిమాలను వదులుకుని ప్రేమా.. గీమా అంటూ ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ తరువాత ఏమైందో ఏమో.. ఇప్పుడు ఆ ప్రేమ బ్రేకప్ అవ్వడంతో ఈ అమ్మడు కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి .. మళ్ళీ సినిమాలే బెటర్ అనుకుంటుంది. అందుకే మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టిన శృతి కి ఇలా హాలీవుడ్ ఛాన్స్ రావడం నిజంగా లక్కీ ఛాన్స్ అని చెప్పాలి.