బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి పడుతున్నారు.! రాజకీయాల్లో భ్రష్టత్వం ఎక్కువైపోయింది. ఎవరెంత ఎక్కువగా బూతులు మాట్లాడితే, వాళ్ళకి అంత ఎక్కువగా మీడియాలో స్పేస్ దక్కుతోంది.
ఛోటామోటా నాయకుల నుంచి, బడా నాయకుల వరకూ ఈ పబ్లిసిటీ కక్కుర్తి ఎక్కువైపోయింది. న్యూస్ ఛానళ్ళు కూడా టీఆర్పీ రేటింగులకు కక్కుర్తి పడి, రాజకీయ నాయకుల బూతుల్ని మేగ్జిమమ్ ఎలివేట్ చేస్తున్నారు. చర్చా కార్యక్రమాల పేరుతో, ‘అడల్ట్ ఓన్లీ’ కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నారు.
సీన్‌లోకి కొత్తగా ఛీరెడ్డి వచ్చింది. ఆ మధ్య సినీ పరిశ్రమలో తనకేదో అన్యాయం జరిగిపోయిందని నడిరోడ్డు మీద నగ్నత్వం ప్రదర్శించిన ఛీరెడ్డి, తరచూ సోషల్ మీడియా వేదికగా వెదసల్లే జుగుప్స అంతా ఇంతా కాదు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారంపై దుమారం చెలరేగుతున్న వేళ, ఛీరెడ్డి రంగంలోకి దిగింది. కాదు కాదు, ఆమెను వైసీపీనే దించినట్టుంది.
‘మీరు వందమంది అయినాసరే, మీకు నేనొక్కదాన్ని చాలు వైసీపీ నుంచి..’ అంటూ తనను తాను వైసీపీ నాయకురాలిగా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేసుకుంటోంది ఛీరెడ్డి. బూతులు తిట్టడానికి ఛీరెడ్డి అయితేనేం, ఇంకెవరైతేనేం. నిజానికి, ఎవరైనా బూతులు తిట్టగలరు. తిట్టడం చేత కాక కాదు, కాస్తంత సంయమనం పాటిస్తారంతే. అక్కడికి తాము మాత్రమే బూతుల్లో మాస్టర్ డిగ్రీ చేసినట్లుగా కొడాలి నాని, ఛీరెడ్డి లాంటోళ్ళు ప్రవర్తిస్తుంటారు.
వినడానికి వీల్లేనంత జుగుప్సాకరమైన బూతులు వాడింది ఛీరెడ్డి. ‘చూపిస్తే తప్పేమంటి.? కొట్టుకుంటే తప్పేంటి.? మీరు కొట్టుకోరా.?’ అంటూ రాయడానికి వీల్లేని స్థాయిలో చెలరేగిపోయింది. ఇది జస్ట్ టీజర్ మాత్రమే.! నిజానికి, అసలు సినిమా ముందుంది. ఎందుకంటే, ఆమెను ఆ స్థాయిలో ‘పేమెంట్’ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మీదకు ఈమెను వదిలి, ఎంత ఛండాలం చేశారో చూశాం. చివరికి చేసిన తప్పుకి ఆమె క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ కథ మొదటికొచ్చినట్లుంది.
అందరూ కలిసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఎంత భ్రష్టుపట్టించేశారో అర్థమవుతోంది కదా.? ఇంకా ముందుంది అసలు కథ. ఎన్నికల వాతావరణం షురూ అయితే, ఈ ఛీరెడ్డి కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. రోడ్ల మీద పడి చేసే ఛండాలం వేరే లెవల్‌లో వుండబోతోందేమో.!