Srikanth Odela: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. గతేడాది విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సుకుమార్ శిష్యుడిగా వచ్చిన శ్రీకాంత్ ఓదెల తొలి సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు. సినిమాలో నటీనటుల నటనకు పలు అవార్డులు కూడా వరించాయి. ఈక్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతోంది. అయితే.. సినిమా టైటిల్ లీక్ కావడం చిత్ర బృందానికి షాక్ ఇచ్చింది. దీంతో దర్శకుడు శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మా సినిమా టైటిల్ ఎవరు లీక్ చేశారో నాకు తెలుసు. మా టీమ్ మెంబర్స్ కాదు. లీక్స్ వస్తే యూనిట్ సభ్యులను అనుమానించొద్దు. అసిస్టెంట్ డైరక్టర్స్, రచయిత టీమ్ ను తప్పుబట్టకూడదు. వారేంటో నాకు తెలుసు. వీరంతా అప్ కమింగ్ టాలెంట్. సినిమాకు ఎంతో సేవ చేయాల్సినవాళ్ల’ని శ్రీకాంత్ అన్నారు. నాని హీరోగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు ‘ది ప్యారడైజ్’ గా నిర్ణయించారు. టీమ్ రివీల్ చేసేలోగా లీక్ అయింది.