Sreemukhi: యాంకర్ శ్రీముఖి తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ క్షమాపణలు చెప్పారు. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని ఓ వీడియోలో అన్నారు. ‘ఇటివల నేను హోస్ట్ గా వ్యవహరించిన ఓ సినిమా ఈవెంట్లో రామలక్షణులను ఫిక్షనల్ అనటం జరిగింది. నేనూ హిందువునే. దైవభక్తురాలిని. నేను రాముడిని నమ్ముతాను. కానీ.. నేను చేసిన వ్యాఖ్యల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈవ్యాఖ్యలు చేసినందుకు క్షమించమని కోరుతున్నా. ఇకపై జాగ్రత్తగా మాట్లాడతానని మాటిస్తున్నాను. పెద్ద మనుసుతో క్షమించాలని కోరుతూ.. జై శ్రీరామ్’ అని అన్నారు.
జరిగిందేంటంటే.. ఇటివల నిజామాబాద్ లో జరిగిన వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం..’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీముఖి వ్యవహరించారు. అయితే.. దిల్ రాజు-శిరీష్ ల గురించి మాట్లాడుతూ.. ‘రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని మనం విన్నాం. కానీ.. ఇప్పుడు మన కళ్ల ముందే కనిపిస్తున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే.. మరొకరు శిరీష్’ అని అన్నారు. ఆమె వాఖ్యలపై దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పారు.
https://www.instagram.com/reel/DEkJzrby3Sn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==