పుష్ప-2 గురించి ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సరే ఇంకా షూటింగ్ లోనే బిజీగా ఉంటున్నారు మేకర్స్. పుష్ప-1లో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో పార్టు-2లో కూడా క్రేజీ ఐటెం సాంగ్ ఉంటుందని మొదటి నుంచే మూవీ టీమ్ లీకులు ఇస్తోంది. దానికి తగ్గట్టే మొన్న ఐటెం సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సాంగ్ కోసం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్దా కపూర్ ను తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఆమె అయితే బాలీవుడ్ లో కూడా ఆటోమేటిక్ గా మూవీకి మార్కెట్ పెరుగుతుందని ఆశించారు.
ఆమె కూడా సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. కానీ రూ.8 కోట్లు కావాలంటూ ఆమె డిమాండ్ చేసిందంట. అంత ఇచ్చుకోలేమని.. రూ.3 కోట్లు ఇస్తామని నిర్మాతలు చెప్పినా.. ఆమె ఒప్పుకోలేదని కథనాలు వచ్చాయి. చివరకు చేసేది లేక వాళ్లు శ్రీలీలను తీసుకున్నారంట. శ్రీలీలకు బాలీవుడ్ ఇమేజ్ లేకపోయినా.. సౌత్ ఇండియాలో యూత్ లో మంచి క్రేజ్ ఉంది. పైగా అందం, డ్యాన్స్ లో ఆమెకు తిరుగులేదు. అందుకే ఆమెను ఓకే చేశారంట. అయితే ఆమెకు ఈ ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు ఇస్తున్నారంట నిర్మాతలు.
ఇప్పటికే సాంగ్ షూటింగ్ కూడా స్టార్ అయింది. కాగా నిన్న రాత్రి ఈ సాంగ్ లో బన్నీ, శ్రీలీల లుక్ లీక్ అయింది. ఇందులో శ్రీలీల లుక్ కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉంది. సమంతను మించేలా ఆమె ఇందులో అందాల రచ్చ చేయబోతోందని చూస్తేనే అర్థం అవుతోంది.