Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పుడీ సినిమా సెట్లో యువ స్టార్ హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోల్ని శ్రీలీల ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ‘విత్ ఓజీ.. వెండితెరపై మనమెంతో ఆదరించే మన శంకర్ దాదా ఎంబీబీఎస్. మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కానుక. మీ అభిమానానికి, కానుకకు ధన్యావాదాలు. రుచికరమైన భోజనానికి ధన్యావాదాలు. ఇంకా ఉప్మా, దోశకు..’ అని రాసుకొచ్చారు. చిరంజీవి ఆమెకు వెండిరంగు శంఖాన్ని బహుకరించారు.
విశ్వంభరలో ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవిపై ఓ సోలో సాంగ్ చిత్రీకరించింది చిత్ర బృందం. జనవరికే విడుదల కావాల్సిన సినిమా గేమ్ చేంజర్ కోసం వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వశిష్ఠ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.