Switch to English

శ్రీ విష్ణు ‘గాలి సంపత్’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow
Movie గాలి సంపత్
Star Cast శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్
Director అనీష్
Producer ఎస్ కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది
Music అచ్చు రాజమణి
Run Time 1 గంట 58 నిమిషాలు
Release మార్చ్ 11, 2021

యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్ర పోషించిన సినిమా ‘గాలి సంపత్’. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకి అనీష్ కృష్ణ డైరెక్టర్. టీజర్, ట్రైలర్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో? ఇందులోని ఫిఫీ భాష ఎంత నవ్వించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఓ యాక్సిడెంట్ లో వోకల్ కార్డ్స్ దెబ్బతినడం వలన సంపత్(రాజేంద్ర ప్రసాద్)కి మాట రాదు. అందుకే తను ఫిఫీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఊరి వాళ్లంతా గాలి సంపత్ అని పిలుస్తుంటారు. అతని కొడుకే సూరి(శ్రీవిష్ణు). ఓ డిసిఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేసే సూరి సొంతంగా డిసిఎం వ్యాన్ కొనుక్కోవడమే లక్ష్యంగా తిరుగుతుంటాడు. గాలి సంపత్ కి ఉన్న యాక్టింగ్ పిచ్చి వలన సూరికి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు గాలి సంపత్ కారణంగా, సూరి ప్రేమ పెళ్లి డిస్టర్బ్ అవ్వడమే కాకుండా, డిసిఎం వ్యాన్ కోసం అప్పు చేసి తెచ్చిన 5 లక్షల డబ్బుని ఖర్చు చేసేస్తాడు. ఆ రోజు తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత అనుకోకుండా గాలి సంపత్ ఇంటి వెనకున్న 30 అడుగుల నుయ్యిలో పడిపోతాడు. మాట రాని గాలి సంపత్ ఆ నుయ్యి నుంచీ బయట పడడం కోసం ఎదుర్కున్న సవాళ్లేమిటి? గాలి సంపత్ కనపడకుండా పోయాక సూరి ఏం చేసాడు? తన తండ్రి గాలి సంపత్ గురించి సూరి తెలుసుకున్న నిజాలేమిటి? ఫైనల్ గా గాలి సంపత్ నుయ్యి నుంచీ బయటకి వచ్చాడా? లేదా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

మొదటి నుంచీ టీం చెప్పుకుంటూ వచ్చినట్టు ఈ సినిమాకి హైలైట్ రాజేంద్ర ప్రసాద్ నటన. ఈ మధ్య కాలంలో అయన పలు సినిమాల్లో నటిస్తున్నా గాలి సపంత్ అనే పాత్రలో ఆయన నటన చాలా కాలం గుర్తుండిపోయేది అవుతుంది. ఎనర్జీ, ఫిఫీ లాంగ్వేజ్ ని డెలివర్ చేసిన విధానం చూసాక నటన పరంగా సూపర్బ్ అని చెప్పాల్సిందే. సినిమా అంతా ఒక ఎత్తైతే, ప్రీ ఇంటర్వల్ లో చేసిన మోనోలాగ్ అయితే అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీ విష్ణు బాధ్యత గల కుర్రాడి పాత్రలో చాలా బాగా చేసాడు. ఇంటర్వల్ ఎమోషనల్ సీన్ లో శ్రీ విష్ణు – రాజేంద్ర ప్రసాద్ చాలా బాగా చేశారు. లవ్లీ సింగ్ ది చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా ఉన్నంతలో ఓకే అనిపించుకుంది. ఇక ఈ సినిమాలో ఫిఫీ భాషకి ట్రాన్స్ లేటర్ పాత్ర చేసిన సత్య గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. సత్య కామెడీ టైమింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులకి నవ్వులు పనిచేసి మాత్రం ఇతనే. శ్రీకాంత్ అయ్యంగర్ సెకండాఫ్ లో అడపాదడపా నవ్వించే ప్రయత్నం చేసాడు. తణికెళ్లభరణి, మిర్చి కిరణ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, రచ్చరవి లాంటి వాళ్ళు అలా అక్కడక్కడా మెరిశారు.

తెర వెనుక టాలెంట్..

ఎస్ కృష్ణ రాసుకున్న కథలో ఓ మాటలు రాని ఒకతను ఓ 30 అడుగుల నుయ్యిలో పడిపోతే ఎలా బయటకి వచ్చాడు అనేది కొత్తగా అనిపించే పాయింట్ కానీ దాని చుట్టూ రాసుకున్న కథ మాత్రం చాలా పాతది. కథలో వేసుకున్న సీన్లు కూడా కొన్ని హిట్ సినిమాల్లో, మరెన్నో ప్లాప్ సినిమాల్లో చూసేసినవే కావడం వలన సినిమా పూర్తయ్యే టైంకి పరమ రొటీన్ అనిపిస్తుంది. సన్నివేశాలు పాతవైనా పర్లేదు, కానీ ఈ సినిమాకి కీలకమైనది ఎమోషనల్ టచ్.. ఎమోషనల్ కనెక్షన్ అనేది పాత్రలని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆడియన్స్ కి కనెక్ట్ చేయాలి. కానీ పాత్రల మధ్య ఎమోషన్స్ డెవలప్ చేయకుండా కామెడీ సీన్స్ వేసుకుంటూ వెళ్లడం వలన ఎమోషనల్ యాంగిల్ లో సాగే సెకండాఫ్ కంప్లీట్ గా బోర్ కొట్టేస్తుంది. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా లేదు. దానికి కారణం గుండెను హత్తుకోవాల్సిన ఎమోషనల్ సీన్స్ ని కూడా చాలా లైటర్ వేలో నడిపించడం, ఫ్లాష్ బ్యాక్ బలంగా లేకపోవడం. అలాగే డైరెక్టర్ గా అనీష్ కృష్ణ మార్క్ కన్నా అనిల్ రావిపూడి ఫ్లేవరే ఎక్కువగా కనపడుతుంది. అటు డైరెక్టర్ గా అనీష్, ఇటు డైరెక్షన్ సూపర్ విజన్ చేసిన అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. మిర్చి కిరణ్ డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా సత్యకి రాసిన కొన్ని వన్ లైనర్స్ సూపర్బ్.

ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్ లో సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ విజువల్స్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది మాత్రం అచ్చు రాజమణి మ్యూజిక్ అని చెప్పాలి. పాటలు ఓకే కానీ నేపధ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. కానీ అంత మంచి మ్యూజిక్ కి తగ్గా కంటెంట్ సీన్స్ లో లేకపోవడం బాధాకరం. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఓకే కానీ సెకండాఫ్ లో రిపీటెడ్ షాట్స్ తగ్గించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– రాజేంద్ర ప్రసాద్ అద్భుత నటన
– సత్య కామెడీ
– నవ్వించే ఫస్ట్ హాఫ్
– అచ్చు రాజమణి మ్యూజిక్
– స్టోరీలోని కీ పాయింట్

బోరింగ్ మోమెంట్స్:

– వీక్ గా అనిపించే ఫ్లాష్ బ్యాక్
– చాలా రొటీన్ గా సాగే కథ
– ఆసక్తి లేని కథనం
– ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం

విశ్లేషణ:

కమర్షియల్ కామెడీ చిత్రాలతో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడిని ముందుంచి సినిమాని ప్రమోట్ చేయడం, అదీకాక స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ పర్యవేక్షణ క్రెడిట్స్ కూడా వేసుకోవడం వలన ఇది ఓ రేంజ్ ఎంటర్టైనర్ అనుకొనిని వెళ్తే మాత్రం డిజప్పాయింట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ కాస్త సరదాగా అనిపించినా సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వకపోవడం వలన ఆడియన్స్ చాలా వరకూ కథకి డిస్కనెక్ట్ అయిపోతారు. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటన కనబరిచినా ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వలన గాలి సంపత్ చూసాక ఓ మంచి కాన్సెప్ట్ ని జస్ట్ ఓకే ఓకే అనేలా చేశారనిపిస్తుంది.

చూడాలా? వద్దా?: ఫఫఫాఫ ఫపే (రేటింగ్ ని బట్టి మీకు నచ్చిన విధంగా ట్రాన్స్ లేట్ చేసుకోవాలని మనవి)

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.5/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...