ఆంధ్రప్రదేశ్‌లో చిత్తడి నేలలకు ప్రత్యేక గుర్తింపు: పవన్ కల్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,411FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తడి నేలల గుర్తింపు, సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 16 చిత్తడి నేలలను గుర్తించి, వాటి పరిరక్షణ చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు.

దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చిత్తడి నేలలకు గుర్తింపు ఇచ్చే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. సోంపేట, తవిటి మండలాల్లోని వేలాది ఎకరాల్లో విస్తరించిన పెద్ద బీల, చిన బీల, తుంపరలను అనుసంధానించి పర్యాటక కారిడార్ రూపకల్పనపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జల పెరుగుదల, ఎకో టూరిజం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, వీరాపురం, పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, కొల్లేరు సరస్సుల వంటి చిత్తడి నేలలకు అంతర్జాతీయ గుర్తింపు (రాంసర్) పొందే విధంగా ప్రయత్నాలు చేపడతామని తెలిపారు.

సదస్సులో అటవీ, పంచాయతీ, వన్యప్రాణి విభాగాల అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భౌగోళిక సరిహద్దుల గుర్తింపు, అభివృద్ధి చర్యలపై చర్చలు జరుగుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ వేగవంతం చేయాల్సిన దిశలో నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 23,450 చిత్తడి నేలల్లో 99.3 శాతం డిజిటల్ సరిహద్దులు గుర్తించబడినట్టు, ఈ నెల 28 వరకు భౌతిక సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయాల్సిందిగా మంత్రి తెలిపారు.

చిత్తడి నేలల సంరక్షణతో పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచే అవకాశాలు సృష్టించబడ్డాయి.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఏజీఎస్ సినిమాస్ గ్రూప్ యజమాని కల్పాత్తి...

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ,...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...