గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సన డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రెజెంట్ ఈ సినిమా నైట్ షూట్స్ జరుగుతున్నాయి. సినిమాలో ముఖ్య తారాగణంతో ఎపిసోడ్స్ జరుగుతున్నాయి.
ఐతే RC16 సెట్ లో స్పెషల్ గెస్ట్ సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ గెస్ట్ గురించి ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇంతకీ వచ్చింది ఎవరు.. రామ్ చరణ్ ఏమని పెట్టాడు అంటే.. మై లిటిల్ గెస్ట్ ఆన్ సెట్స్ RC16 అంటూ ఇన్ స్టాగ్రాంలో ఫోటో పెట్టి రాసుకొచ్చారు రామ్ చరణ్. ఇక వచ్చిన గెస్ట్ ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రామ్ చరణ్ తనయురాలు కొణిదెల క్లింకార మొదటిసారి ఒక సినిమా సెట్ కి వచ్చింది. అది కూడా తన తండ్రి హీరోగా నటిస్తున్న సెట్స్ కి వచ్చింది. అంతేకాదు నైట్ షూట్ లో క్లింకార రాకతో సెట్ అంతా సందడి సందడిగా మారినట్టు తెలుస్తుంది.
చరణ్ తన కూతురిని తీసుకుని తొలిసారి సినిమా లొకేషన్ కి రావడం బహుశా ఇదే మొదటిసారి అయ్యి ఉండొచ్చు. అందుకే ఆ మూమెంట్ ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని RC16 సెట్స్ లో లిటిల్ గెస్ట్ అంటూ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడు.