Switch to English

టిబి స్పెషల్: ‘ఎస్పీ బాలు..’ నోటితో చెప్పలేం.. రాతల్లో రాయలేం.. చెవులారా ‘వినా’ల్సిందే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

మెలోడీ, ర్యాప్, కామెడీ, ట్రాజెడీ.. సందర్భం ఏదైనా అందుకుతగ్గ భావాన్ని అర్ధం చేసుకుని పాడటంలో ఆయన దిట్ట. తెరపై ఓ హీరో పాట వస్తుంటే ఆ హీరోనే స్వయంగా పాడుకున్నాడా అనే భావన తీసుకురావడంలో ఆయన సిద్ధహస్తుడు. సంగీత స్వరాల్లో మునిగి తేలకపోయినా.. ఓ పాట అందుకున్నాడంటే శ్రోతలు తన్మయత్వంలో మునిగిపోవాల్సిందే. దశాబ్దాలుగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడిన ఆ స్వర జ్ఞాని ‘ఎస్పీ బాలసుబ్రమణ్యం’. ఆయనలోని కళాతృష్ణ గురించి ఎంత చెప్పినా.. రాసినా తక్కువే. ఎందుకంటే ఆయన గొప్పదనాన్ని ‘చెవులారా వినాల్సిందే’ కాబట్టి.

బాలు నేపథ్యం..

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. బాలు భార్య పేరు సావిత్రి. పిల్లలు చరణ్, పల్లవి. బాలు సోదరి ఎస్పీ శైలజ కూడా ప్రముఖ సినీ నేపథ్య గాయని. బాలుతో కలిసి పలు సినిమాల్లో పాటలు పాడారు. నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడారు. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న నెల్లూరులో మరణించారు. నెల్లూరు లోని శ్రీ కస్తూర్బా కళాక్షేత్రంలో బాలసుబ్రహ్మణ్యం తన తండ్రి సాంబమూర్తి విగ్రహం ఆవిష్కరించారు.

సినిమా అవకాశాలు..

తండ్రి హరికథా కళాకారుడు. దీంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సు AMIE చేస్తూనే వేదికలపై పాటలు పాడుతూ తనలోని ప్రతిభకు సానబెట్టుకున్నారు. 1966 లో పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ‘చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ సినిమా తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమా అవకాశాలే వచ్చాయి.

తెరపై నటుడిగా..

1969 లో బాలు నటుడిగా తొలిసారి ‘పెళ్ళంటే నూరేళ్ళ పంట’ సినిమాలో నటించారు. అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవ.. వంటి కొన్ని సినిమాల్లో నటించారు. 1990 లో తమిళంలో వచ్చిన ‘కేలడి కన్మణి’ అనే సినిమాలో బాలు హీరోగా నటించాడు. రాధిక హీరోయిన్. తెలుగులో ‘ఓ పాప లాలీ’ పేరుతో డబ్ అయింది.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా..

కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘మన్మధ లీల’తో బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. ఆ సినిమాలో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో రజినీకాంత్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులోకి వచ్చే కమల్ హాసన్ సినిమాలు అన్నింటికీ బాలునే డబ్బింగ్ చెప్పేవారు. కమల్ హాసన్ ‘దశావతారం’ సినిమాలో కమల్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో ముసలావిడ పాత్ర కూడా ఉండటం విశేషం. ‘అన్నమయ్య’లో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, ‘సాయి మహిమ’ సినిమాలో బాలునే డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు సినిమాలకు గానూ ఆయనకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులు దక్కాయి.

టీవీ రంగంలో..

టీవి రంగంలో కూడా బాలు వేసిన ముద్ర అనన్యసామాన్యం. ఈటీవీ పాడుతా తీయగా, పాడాలని ఉంది, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలతో కొత్త ప్రతిభను వెలికితీశారు. ఈ కార్యక్రమాల ద్వారానే నూతన గాయనీ గాయకులు పరిచయమయ్యారు. ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ఓ సెన్షేషన్. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం 2016 వరకూ కొనసాగుతూనే ఉంది.

రికార్డింగ్ స్టూడియో..

బాలు తొలిసారి పాడిన పాటకు సంగీతం ఎస్.పి.కోదండపాణి అందించారు. దీంతో తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ఇచ్చిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని పేరు పెట్టుకున్నారు. ‘నిర్మాతగా తన బ్యానర్ కు కోదండపాణి ఫిలిం సర్క్యూట్స్’ పేరు పెట్టుకున్నారు. భామనే సత్యభామనే, తెనాలి, శుభ సంకల్పం.. వంటి సినిమాలు నిర్మించారు. ఆదిత్య 369కు భాగస్వామిగా ఉన్నారు.

బాలులోని స్పెషల్ టాలెంట్..

బాలు ఏ హీరోకు పాడితే ఆ హీరోనే స్వయంగా పాడుకున్నట్టు ఉంటుంది. తెర వెనక బాలు చేసిన మాయ తెరపై కనిపించేది కాదు. హీరోల స్టైల్, బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ పాట పాడి ప్రాణం పోసేవారు. అందరి హీరోలకు ఒక ఎత్తు శంకరాభరణం ఒక ఎత్తు. కొత్త నటుడైన జేవీ సోమయాజులే పాటలు పాడుకున్న అనుభూతితో బాలు పాడిన పాటలు, ఆయన గాత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీంతో ఘంటసాల తరువాత తెలుగు సినిమా పాటకు అసలు సిసలు వారసుడిగా నిలిచారు. భాషపై పట్టు, పదాలు పలకడంలో స్పష్టత ఆయన గొంతులోని మాధుర్యాన్ని ఇనుమడింపజేసేవి.

పాటల ప్రస్థానం..

40 ఏళ్ళ బాలు సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఏకంగా 11 భాషల్లో ఆయన గానామృతం కొనసాగింది. 47 సినిమాలకి సంగీత కూడా అందించారు. ఇదొక రికార్డు. తెలుగు, తమిళంతోపాటు కన్నడంలో బాలు పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించడం విశేషం. బాలు పాట లేని సినిమా లేదు. బాలు పాట లేకపోతే అసలు సినిమాయే లేదు.. బాలు పాడని పాట పాటే కాదు.. అనేంతగా ఆయన ప్రస్థానం కొనసాగింది. ఘంటసాల తర్వాత మళ్లీ అంతటి వైభవాన్ని ఎస్పీ బాలు సాధించారు. ముఖ్యంగా డబ్బై, ఎనభై దశకాల్లో బాలు హవానే కొనసాగింది. తొంభైల్లో కొత్త గాయకులు వచ్చినా బాలు స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. అభిమానులు ఆయన్ను ‘బాలు’ అని పిలిస్తే.. గాన గంధరర్వుడు అంటూ ప్రేక్షకులు పిలిచుకున్నారు.

బాలుని వరించిన ప్రతిష్టాత్మక అవార్డులు..

బాలు ప్రతిభకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, ప్రతిష్టాత్మకమైన అవార్డులెన్నో వరించాయి. వీటిలో 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

సినిమా పురస్కారాలు..

అత్యధిక పాటలు పాడిన రికార్డు బాలు పేరు మీదనే ఉంది. 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979లో ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. రెండేళ్ల తర్వాత హిందీలో ‘ఏక్ దూజే కేలియే’ చిత్రానికి గాను రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సాగరసంగమం, రుద్రవీణ చిత్రాలకు కూడా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏకంగా 25 సార్లు వివిధ విభాగాల్లో నంది అవార్డులు అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు నంది బహుమతి లభించింది. 2016 నవంబర్ లో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘శత వసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ’ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.

బాలు చివరి దశ..

ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా బాలుకు సోకింది. 2020 ఆగస్టు నెలలో కోవిడ్-19 బారిన పడ్డారు. దీంతో ఆయన వీడియోలో స్పందించారు. తాను కోవిడ్ పాజిటివ్ కు గురయ్యానని.. ఎవరూ తన గురించి వాకబు చేయొద్దన్నారు. త్వరలోనే తాను కోవిడ్ ను జయించి క్షేమంగా తిరిగి వస్తానని చెప్పారు. చెన్నైలోని ఎంజీఎమ్ ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఆయన కరోనాను అతి కష్టంపై జయించారు. ఐసీయూ, ఎక్మో చికిత్స.. తో 40 రోజులకు పైగా జీవిత పోరాటం చేశారు. ఇటివలే కోలుకున్నారు. ఇంటికి కూడా వెళ్లారు. అశేష అభిమానుల కోరిక బలమైనదే అని భావించేలోపే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కానీ.. ఈసారి విధి విజయం సాధించింది. బాలు గొంతు ఎవరికీ వినిపించనంత దూరం తీసుకెళ్లిపోయింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...