రాజకీయ పార్టీలకు కార్యకర్తలుంటారు.! కానీ, జనసేన పార్టీకి సైనికులున్నారు.! ‘వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఓటు హక్కు కూడా లేని పిల్లలు..’ అంటూ జనసేన పార్టీ మీద ఒకప్పుడు వినిపించిన రాజకీయ విమర్శలు అన్నీ ఇన్నీ కావు.!
తమ తల్లిదండ్రులతో జనసేన పార్టీకి ఓటేయించడానికి కష్టపడ్డారు జనసైనికులు ఒకప్పుడు. కానీ, ఆ జనసైనికుల తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి జనసేన పార్టీ ఎదిగిందిప్పుడు.!
స్ట్రైక్ రేట్ 100 అంటే చిన్న విషయం కాదు మరి.! చెప్పాడంటే, చేస్తాడంతే.! ఔను, ‘వైసీపీ అనే మహిషాన్ని అదః పాతాళానికి తొక్కుతాం.. నెత్తి మీద కాలు వేసి తొక్కుతాం కదా..’ అంటూ 2024 ఎన్నికలకు ముందు అల్టిమేటం జారీ చేసిన పవన్ కళ్యాణ్, మాట నిలబెట్టుకున్నారు.
జనసేన అంటే, ఇప్పుడు కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అదొక రాజకీయ శక్తి.! ‘పవన్ అంటే, ఉత్త గాలి మాత్రమే కాదు.. అదొక తుపాన్..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు.. అది కూడా, తెలుగునాట కాదు, దేశ రాజకీయాల్లో.
నేషనల్ మీడియా, ‘పాన్ ఇండియన్ పొలిటికల్ పవర్ స్టార్’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి పుంఖాను పుంఖాలుగా కథనాల్ని ప్రసారం చేసిందంటే, తెలుగునాట రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
‘చెరి సగం సీట్లలో జనసేన – టీడీపీ పోటీ చేస్తాయ్’ అనే ప్రచారం దగ్గర్నుంచి, కనీసం డెబ్భయ్ ఐదు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అనే ప్రచారాల వరకూ.. రకరకాల ఊహాగానాలు 2024 ఎన్నికలకు ముందు వినిపించాయి.
చివరికి, కేవలం 21 సీట్లతో సరిపెట్టుకోవాల్సింది జనసేన కూటమి పంపకాల్లో భాగంగా. 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్ సభ సీట్లు.. జనసేన తీసుకోవాల్సి వస్తే, కొందరు జనసైనికులూ లోలోపల ఆవేదన చెందారు. కొందరు బాహాటంగానే తమ ఆవేదనను వెల్లగక్కారు.
‘ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామా.? లేదా.? అన్నదే లెక్క..’ అని పవన్ కళ్యాణ్, పార్టీ కార్యకర్తలకు, నేతలకు నచ్చజెప్పారు. ‘వ్యూహం నాకు వదిలెయ్యండి..’ అని అన్నారు.
కట్ చేస్తే, పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లలో బంపర్ విక్టరీ. అత్యద్భుతమైన మెజార్టీలతో ఆయా అభ్యర్థులు గెలవడం.. వెరసి, తెలుగునాట రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అరుదైన సంతకం చేశారు.
పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే కావొచ్చు. పార్టీ పెట్టగానే వచ్చిన ఎన్నికల్లో పోటీ చేయడానికి మీనమేషాల్లెక్కెట్టి వుండొచ్చు.. ఐదేళ్ళ తర్వాత పోటీ చేసి, ఒకే ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకుని వుండొచ్చు.. అధినేత, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయి వుండొచ్చు.. కానీ, పదేళ్ళలో జనసేన పార్టీ క్రమక్రమంగా ఎదిగింది.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే, శిఖరం.!
డిప్యూటీ సీఎం అనే పదవి కొత్త కాదు.. కానీ, ఆ పదవికి దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ మాత్రమే. డిప్యూటీ సీఎంగా తాను నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి 100 శాతం ఎఫర్ట్స్ పెడుతున్నారు జనసేనాని. అభివృద్ధి కోణంలో మారుతున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ చిత్రమే ఇందుకు నిదర్శనం.
ఔను, ఆ సినీ అభిమానులే.. కార్యకర్తలయ్యారు.. నిఖార్సయిన జనసైనికులుగా, జనసేన పార్టీని రాజకీయ యుద్ధంలో గెలిపించారు.! అధినేత ఏం చెప్పినా తు.చ. తప్పకుండా పాటించే కార్యకర్తలుంటే, ఏ పార్టీకి అయినా అంతకన్నా కావాల్సిందేముంది.?
భవిష్యత్ లక్ష్యాలు పెద్దవే వున్నాయ్.! ఆ లక్ష్యాల దిశగా పార్టీ క్యాడర్‌కి దిశానిర్దేశం చేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్, ‘జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని’ వేదికగా చేసుకోనున్నారు. ఈ వేడుకకు ‘జయకేతనం’ అనే పేరు పెట్టారు జనసేనాని.!
2019లో ఒకే ఒక్క సీటు.! 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లు. ఆపై, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా.! ముందు ముందు జనసేన రాజకీయ ప్రస్తానం, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ‘అంతకు మించి’ వుండబోతోంది.!
‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం’ అని పవన్ కళ్యాణని హేళన చేసిన ఏ ఒక్క వైసీపీ నేత కూడా, ఈ రోజు అసెంబ్లీ గేటు దాటి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు.! వారాహి రధ చక్రాల కింద వైసీపీ రాజకీయ భవిష్యత్తు చితికిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?