Switch to English

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ బాగా పెరిగింది. వరసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వచ్చిన సోను సూద్ కు ఇటీవలే బాగా గ్యాప్ వచ్చింది. మహేష్ తో చేసిన ఆగడు తర్వాత ఇక్కడ ఎక్కువగా కనపడలేదు సోను సూద్. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి టాలీవుడ్ లో రీ ఎంట్రీ టైప్ ఇస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య సినిమాలో సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా గురించి సోను సూద్ చాలా గొప్పగా అనుకుంటున్నాడు. కథాబలం ఉన్న చిత్రాలు అందించడం కొరటాల శివ స్పెషలిటీ. కేవలం హీరో పాత్ర మాత్రమే కాకుండా మిగిలిన పాత్రలను కూడా చక్కగా తీర్చిదిద్దుతాడు.

ఈ నేపథ్యంలో సోను సూద్ ఆచార్య గురించి మాట్లాడుతూ ఇందులో చాలా మంచి పాత్ర చేస్తున్నానని, చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటించడం ఆనందంగా ఉందని, ఇందులో నా పాత్ర నెగటివ్ ఆ పాజిటివ్ ఆ అన్న విషయం చెప్పలేనని, కానీ ఈ పాత్రను చాలా కాలం ప్రేక్షకులు గుర్తించుకుంటారని తెలిపాడు.

ఇక చిరంజీవితో కలిసి నటించడం అద్భుతమైన అనుభవమని, అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా తన వినయంగా సెట్స్ లో నడుచుకుంటారని, మెగా స్టార్ నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని, మళ్ళీ తనతో త్వరగా పనిచేయాలని ఉందని, ఆచార్య షూట్ స్టార్ట్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

ఇటీవలే ఎక్కడ చూసినా సోను సూద్ పేరు మార్మోగిపోతోంది. తనను రియల్ హీరో అని అందరూ తెగ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా మైగ్రంట్ లేబర్ ను ముంబై నుండి స్పెషల్ బస్సులు వేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.

సినిమా

హీరోయిన్‌ నుండి హీరోకు కూడా కరోనా పాజిటివ్‌?

తెలుగు బుల్లి తెరకు చెందిన వారిని కరోనా వైరస్‌ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే తెలుగు టీవీ రంగానికి చెందిన వారు పదుల సంఖ్యలో కరోనా...

స్పెషల్ స్టోరీ: ఆల్బమ్ సూపర్ హిట్, కానీ దేవీశ్రీ ప్రసాద్ కి...

ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. ఇటీవల కాస్త స్లో డౌన్ అయినట్టు కనిపిస్తున్నా...

ఎక్స్ క్లూజివ్: బోల్డ్ హీరోయిన్ బాలకృష్ణ – బోయపాటి సినిమా ఓకే...

'ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి, శీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి చాలా...

పుష్పలో టాలెంటెడ్ నటుడి పాత్ర?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్...

నాని హీరోయిన్ కు వరంగా మారిన లాక్ డౌన్

న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ మూవీ జెర్సీ ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది శ్రద్ధ శ్రీనాథ్. తన వయసు కంటే పెద్ద పాత్రే...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.!

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తున్నాయి. వీటిల్లో కొన్ని ‘పాత పథకాలకు కొత్త పేర్లు’ అయితే, ఇంకొన్ని నిజంగానే కొత్త సంక్షేమ కార్యక్రమాలు. ఆయా...

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభన మామూలుగా లేదు. మొన్నటి వరకు సెలబ్రెటీలకు, రాజకీయ నాయకులకు వైరస్‌ దూరంగా ఉందనుకుంటున్న సమయంలో ఇప్పుడు వారికి కూడా పాజిటివ్‌ నిర్థారణ అవుతోంది. ఏపీలో ఇప్పటికే...

బ్రేకింగ్: వైసీపీ నేత హత్యకేసులో టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ...

ఏసీబీ కోర్టులో చుక్కెదురు:అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఈఎస్ఐ స్కాంలో జైలులో ఉన్న అచ్చెన్నాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు...

జగన్‌ సర్కార్‌కి జనసేనాని అభినందనలు.. ఇదీ ‘బాధ్యత’ అంటే.!

రాజకీయాల్లో వున్నాక, బాధ్యతగా వుండాలి..’ మొదటి నుంచీ జనసేన పార్టీ చెబుతున్నది ఇదే. ‘మంచి చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందిస్తాం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం..’ అని గతంలో.. అంటే చంద్రబాబు హయాంలోనూ చెప్పారు.. ఇప్పుడూ...

ఎక్కువ చదివినవి

వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.?

అన్న మాట ప్రకారం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌...

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: నవీన్ చంద్ర – రామకృష్ణ ఎంటర్టైన్ చేయడమే కాదు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాడు.!

'అందాల రాక్షసి'తో హీరోగా పరిచయమై రీసెంట్ గా అరవింద సమేత, ఎవరు సినిమాలలో తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు యంగ్ హీరో నవీన్ చంద్ర. లాక్ డౌన్ కారణంగా పలు చిన్న సినిమాలు...

ప్రభుత్వ నిర్ణయంపై స్పందించిన అమరరాజా గ్రూప్

2010 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరరాజా గ్రూప్‌కు చిత్తూరు జిల్లాలో దాదాపుగా 483 ఎకరాల భూమిని పరిశ్రమల అభివృద్ది కోసం కేటాయించడం జరిగింది. అయితే తాజాగా ఆ భూమిలో కొంత భాగంగాను...

తమిళనాడులో ఘోరం.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య

నిర్భయ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కధువా ఘటన దేశం సిగ్గుపడేలా చేసింది. దిశ ఘటనతో ఆడవారి రక్షణ మరోసారి ప్రశ్నార్ధమైంది. ఇటువంటి ఘెరాలను అరికట్టడానికి.. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక...

యువతిపై అశ్లీల వీడియోల కేసులో ట్విస్ట్.. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా..

గుంటూరులో బీటెక్ విద్యార్ధినిపై అశ్లీల వీడియోలు తీసి వేధిస్తున్న కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో వరుణ్, కౌశిక్ అనే యువకుల్ని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో...