నవ దళపతి సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా జటాధర. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నారు. మైథాలజీ, సూపర్ న్యాచురల్ ఎలిమినెట్స్ తో తెరకెక్కుతున్న జటాధర సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోనాక్షి సిన్హాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన సోనాక్షి సిన్హా జటాధర కోసం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు ఆమె కెరీర్ లో ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ రోల్ ని చేస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన జటాధర సోనాక్షి సిన్హా పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
సుధీర్ బాబు కూడా ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. జటాధర సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలవగా మూవీని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు జటాధర సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్ లో ఉమేష్ కె.ఆర్ బన్సాల్, ప్రేర్న అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ నిర్మిస్తున్నారు.