ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు తీయడం మాత్రమే వచ్చు’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనపై కడప జిల్లాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
సోము వీర్రాజు వ్యాఖ్యలపూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. రాయలసీమ సంస్కృతిని కించపరిచేలా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని.. వెంటనే ఆయన కడప జిల్లా వాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి కాదని అన్నారు. వైఎస్ వివేకా హత్యోదంతాన్ని దృష్టిలో ఉంచుకుని తాను వ్యాఖ్యానించానని అన్నారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు.