ఆసక్తిరేకెత్తిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్‌

ఆసక్తిరేకెత్తిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్‌

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వరుస ఫ్లాప్‌ల తర్వాత చిత్రలహరి మరియు ప్రతి రోజు పండుగే చిత్రాలతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ కాకున్నా కూడా తేజ్‌ కెరీర్‌కు కాస్త బూస్ట్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఈయన సోలో బ్రతకే సో బెటర్‌ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కొత్త దర్శకుడు… స్టోరీ ఏంటో అంటూ చాలా మంది పెదవి విరిచారు. కాని ఇప్పుడు సినిమాపై అందరు ఆసక్తి చూపిస్తున్నారు.

మామూలుగా ఏ కమర్షియల్‌ సినిమాలో అయినా కూడా హీరోకు జోడీ హీరోయిన్‌ తప్పనిసరిగా ఉంటుంది. కాని ఈ చిత్రం ప్రమోషన్‌ చూస్తుంటే హీరో సోలో బ్రతుకే సో బెటర్‌ అన్నట్లుగా తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఈ లెక్కన చూస్తే సినిమాలో హీరోకు లవర్‌ ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోకు లవర్‌ లేకుండా ఎలా ఉంటుంది.. కాని సోలో బ్రతుకే సోబెటర్‌ అనుకుంటున్న అతడు ఎలా జంటకు మారాడు అనే విషయమై ఆసక్తి వ్యక్తం అవుతుంది.

ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. అందరి దృష్టిని ఆకర్షించేలా ఈ చిత్రంలో తేజూ కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుబ్బు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను తేజూ తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.