Naga Chaitanya-Sobhita: అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటివలే వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అనే వాక్యం రాసి తమ వివాహ పెళ్లి ఫొటోలను పంచుకున్నారు శోభిత. భర్త చైతన్య గురించి మాట్లాడుతూ..
‘చైతన్య రూపంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రేమ దొరికింది. చైతన్య ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. సింప్లిసిటీ, మంచి మనసు ఉన్నాయి. అందరితో ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. చైతన్యలాంటి భర్త దొరకడం నా అదృష్టం. తెరపై ఎక్కువగా కనిపించాలనే ఉద్దేశాం నాకు లేదు. నచ్చిన పాత్ర వస్తేనే నటిస్తా’.
‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో చాలా తిరస్కరణలకు గురయ్యా. అందంగాలేనని ముఖం మీదే చెప్పేవారు. మోడలింగ్ లో ఓ యాడ్ ఆడిషన్స్ కు వెళ్తే బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా పనికిరానని అన్నారు. చాలా బాధేసింది. ఆత్మవిశ్వాసంతో పని చేసి కొన్నాళ్లకు అదే బ్రాండ్ కు అంబాసిడర్ అయ్యా’నని పలు జ్ఞాపకాలు పంచుకున్నారు.
View this post on Instagram