Sobhita Dhulipala: నాగ చైతన్య-శోభితా ధూళిపాళ్ల త్వరలో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారనే విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో వీరిద్దరి పెళ్లి నిరాడంబరంగా జరుగనుంది. ఈక్రమంలో శోభితకు మంగళ స్నానాలు చేయించారు. మరోవైపు.. నాగ చైతన్యకూ మంగళ స్నానం చేయాంచారు. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు, వేడుకలు ప్రారంభమయ్యాయి.
సోమవారం శోభితను పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. శోభిత మరింత మెరిసేలా మెరూన్ కలర్ డిజైనర్ శారీలో ముస్తాబయ్యారు. వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకున్నారు. సంప్రదాయ చీరకట్టులో ఆమె అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. డిసెంబర్ 4న (బుధవార) రాత్రి 8.13గంటలకు వీరి వివాహం జరుగనుంది.
రెండేళ్ల క్రితం మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. ముంబైలో జరిగిన ఈవెంట్లో మొదటిసారి కలుసుకున్నామని.. తన మంచి మనసు కట్టిపడేసిందని నాగచైతన్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కుటుంబానికి ఆమె ఇచ్చే విలువ ఆకట్టుకుందని కూడా అన్నారు.
View this post on Instagram