స్మృతి–పలాష్ పెళ్లి పై కుటుంబం క్లారిటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,485FansLike
57,764FollowersFollow

స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ హైప్రొఫైల్ వివాహం, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా అకస్మాత్తుగా అస్వస్థతకు గురవడంతో వాయిదా పడింది. ఆయనను సాంగ్లీ ఆసుపత్రిలో చేర్పించగా, అదే సమయంలో పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరూ డిశ్చార్జ్ కావడంతో కొత్త పెళ్లి తేదీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 7నే కొత్త మ్యారేజ్ డేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన స్పష్టత ఇచ్చాడు. హిందూస్థాన్ టైమ్స్‌కి మాట్లాడుతూ తనకు ఏ కొత్త తేదీ గురించి సమాచారం లేదని, పెళ్లి ఇంకా వాయిదా దశలోనే ఉందని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిసెంబర్ 7 తేదీ పూర్తిగా ఊహాగానమేనని తెలిపాడు. కుటుంబం అధికారికంగా ప్రకటించిన తరువాతే నిజమైన సమాచారమని చెప్పాడు.

ఇదిలా ఉండగా, పలాష్ తల్లి అమితా ముచ్చల్ కూడా పెళ్లి వాయిదాపై స్పందించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిస్థితి రెండు కుటుంబాలను తీవ్రంగా కలచివేసిందని, స్మృతి–పలాష్ ఇద్దరూ చాలా బాధపడ్డారని చెప్పింది. అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా చివరి నిమిషంలో వేడుక ఆగిపోవడం అందరినీ కలతపరిచిందని, త్వరలోనే అన్ని సవ్యంగా జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పలాష్‌పై గతంలో వచ్చిన లవ్ అఫైర్ రూమర్స్, సోషల్ మీడియాలో బయటపడ్డ స్క్రీన్‌షాట్లు కూడా మళ్లీ వైరల్ కావడంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. అయితే అవి పాత విషయాలేనని, ఎలాంటి సంబంధం లేదని ఆ యువతి ఇప్పటికే వెల్లడించింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన పలాష్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు.

మొత్తం మీద స్మృతి మంధానా–పలాష్ ముచ్చల్ పెళ్లి తేదీపై సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా హడావుడి నిజం కాదని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏ పోస్టునూ నమ్మొద్దని కుటుంబం స్పష్టం చేసింది. అభిమానులు ప్రస్తుతం కొత్త అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు.

సినిమా

పెద్ది రన్‌టైమ్ ఫిక్స్.. చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ వస్తుందా?

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ...

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

రాజకీయం

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కర్కాటక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు.. తుల రాశివారికి కొత్త పరిచయాలతో ప్రయోజనం!

మే 13 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు...

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

Daily Horoscope: కన్య వారికి శుభవార్తలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభ సూచనలు

మే 16 , 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం,...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంలో అందరి చూపు త్రిష పైనే !

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు...