SKN: ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గెలిచిన తర్వాత ఓ కుటుంబానికి ఆటో కొనిస్తానని నిర్మాత ఎస్కేఎన్ (SKN) గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కొత్త ఆటో ఆ కుటుంబానికి అందించారు. దీంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే..
ఏపీ ఎన్నికల ప్రచారం జరుగుతూండగా.. ‘పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇచ్చేస్తా’నని మరియమ్మ అనే మహిళ చెప్పిన వీడియో వైరల్ అయింది. జనసేన పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా.. ఆమె అభిమానానికి ముగ్దుడైన ఎస్కేఎన్.. ‘పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత ఆమెకు ఆటో కొనిస్తా’నని స్పందించారు.
మాట ప్రకారం పిఠాపురంలో మరియమ్మ ఇంటికి వెళ్లి ఆటోను కానుకగా ఇచ్చారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నా హీరో, అభిమాన నాయకుడిపై ఆమె చూపిన ప్రేమకు నా బహుమతి. వారి మనవడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పడం సంతోషంగా ఉంద’ని ఎక్స్ లో వారితో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు.