సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు ఇండస్ట్రీలో కాకుండా బయట కూడా తాము ఎదుర్కున్న లైంగిక వేధింపులను కొందరు నటీమణులు బయటపెడుతుంటారు.
ఇక తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంది. వరలక్ష్మీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. లేడీ విలన్ పాత్రలతో పాటు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉంటుంది. విశాల్ తో 12 ఏళ్ల క్రితం నటించిన మదగజరాజా సినిమా ఈ ఏడాది మొదట్లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ.
సినిమాలతో పాటు అటు టీవీషోలలో కూడా జడ్జిగా చేస్తోంది. తాజాగా ఓ తమిళ టీవీషోకు జడ్జిగా వెళ్లగా.. అక్కడ ఓ లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. వెంటనే వరలక్ష్మీ కూడా తన చిన్నతనంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘నీది నాది ఒకే కథ. నేను కూడా చిన్నప్పుడు చాలా లైంగిక వేధింపులు ఎదుర్కున్నారు. ఐదారుగురు నన్ను లైంగికంగా వేధించేవారు. కానీ నేను ఎన్నడూ కుంగిపోలేదు. మన ఆత్మస్థైర్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హార్డ్ వర్క్ ను నమ్ముకుని ముందుకు వెళ్లాలి’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంత పెద్ద హీరో కూతురు అయిన వరలక్ష్మీకి కూడా వేధింపులు తప్పలేదా.. ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.