Switch to English

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ అని వైద్య నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. విధిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి సూచనలు చేస్తున్నారు.

ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ఎత్తివేత దిశగా వెళుతూ.. ఇప్పటికే 90 శాతం మేర సడలింపులు కూడా ఇచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రయాణాలు మొదలుకాగా, ఈనెల 25 నుంచి దేశంలో విమానాలు కూడా తిరగనున్నాయి. ఇక జూన్ ఒకటి నుంచి రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. అయితే, ఆయా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనిషికీ మనిషికీ మధ్య భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు మనుషుల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలని తొలుత కొందరు నిపుణులు పేర్కొనగా.. అది సరిపోదని, కనీసం ఆరడుగుల దూరం ఉంటేనే మంచిదని మరికొందరు పేర్కొన్నారు.

కానీ, తాజాగా ఆరడుగుల భౌతికదూరం కూడా సరిపోదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గాలి సాధారణ వేగంలో ఉన్నప్పుడు కూడా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గితే.. అతడి నోటి నుంచి వచ్చే సాలివా (తుంపర్లు) కనీసం 18 అడుగుల వరకు ప్రయాణిస్తుందని తేలింది. సిప్రస్ లోని యూనివర్సిటీ ఆఫ్ నికోసియా ఈ అంశంపై పరిశోధన నిర్వహించింది. గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నప్పుడు కోవిడ్ వ్యక్తి మామూలుగా దగ్గినా కూడా.. అతడి నోటి నుంచి వెలువడే సాలివా 5 సెకన్లలో కనీసం 18 అడుగుల వరకు వెళుతుందని తాము గుర్తించినట్టు పరిశోధకులు వివరించారు.

ఆ సాలివా ప్రభావం వివిధ రకాల ఎత్తుల్లో ఉన్న పిల్లలు, పెద్దలపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తక్కువ ఎత్తు ఉన్న పెద్దలతోపాటు పిల్లలపై అధిక ప్రభావం పడుతుందని తెలిపారు. తొలుత ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నా.. అనంతరం ఇది గాలిలో మూడు గంటల వరకు జీవించి ఉండగలదని గుర్తించారు. మొత్తానికి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం మనం పాటించే భౌతికదూరం సరిపోదని తేలింది. వైరస్ ను నిరోధించే నాణ్యత కలిగిన మాస్కు ధరించడంతోపాటు జన సమూహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పలువురు సూచిస్తున్నారు.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో, రారో అనే అనుమానాలు రోజురోజుకీ పెరుగుతూనే...

కరోనా అలర్ట్‌ : ముంబయిలో ఆ పరిస్థితి రానే వచ్చేసింది

ఇండియాలో కరోనా ప్రారంభం అయిన సమయంలో చాలా మంది ఇక్కడ కరోనా విజృంభిస్తే ట్రీట్‌మెంట్‌ చేసేందుకు కనీసం బెడ్స్‌ కూడా ఉండవు. కరోనా పేషంట్స్‌ రోడ్ల మీద ఉంచి ట్రీట్‌ మెంట్‌ చేయాల్సి...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ భారీ...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

క్రైమ్ న్యూస్: వేదింపులు భరించలేక భర్తను చంపేసింది

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం దుబ్బ ప్రాంతంకు చెందిన గంధం రమేష్‌ మేస్త్రీ పని చేస్తూ జీవితంను సాగిస్తూ ఉన్నాడు. అతడు ప్రతి రోజు తాగి వచ్చి భార్య పద్మను వేదిస్తూ ఉండేవాడు....